తూర్పు అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తా

టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నన్నపునేని నరేందర్‌
వరంగల్‌,డిసెంబర్‌1(జ‌నంసాక్షి):  తూర్పు నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించిన కొండా దంపతులు ఎక్కడా అభివృ ద్ధి చేయకుండా ఎన్నికల్లో పోటీ చేయడానికి భయపడి పరకాలకు పారిపోయారని వరంగల్‌ తూర్పు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నన్నపునేని నరేందర్‌ ఆరోపించారు. గరంలోని 28వ డివిజన్‌లో నిర్వహించిన టీఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చి ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా నరేందర్‌ మాట్లాడుతూ… తెలంగాణ కోసం గొంగలి పురుగునైనా ముద్దాడుతానన్న కేసీఆర్‌ ప్రకటించినట్లుగానే 2014లో కొండా సురేఖకు టికెట్‌ ఇచ్చి గెలిపించారన్నా రు. టీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన కొండా దంపతు లు అభివృద్ధిని విస్మరించి ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేశారన్నారు. దానిని గ్రహించిన కేసీఆర్‌ వారికి టికెట్‌ కేటాయించలేదన్నారు. ఇక్కడ గెలువలేక పరకాలకు పారిపోయి ఇక్కడకు ఖమ్మం నుంచి ఓ బుడ్డర్‌ఖాన్‌ను తీసుకువచ్చారని విమర్శించారు. తూర్పులో స్థానికులు ఎవరూ పోటీలో లేరని, తాను మాత్రమే స్థానికుడనని ప్రజలం దరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని హావిూ ఇచ్చారు. తూర్పు నియోజకవర్గం అభివృద్ధే లక్ష్యంగా తాను బరిలో దిగానన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, టీఆర్‌ఎస్‌ నా యకులు రాజనాల శ్రీహరి, గుండు సుధారాణి, నీలం రాజ్‌కిషోర్‌, డాక్టర్‌ హరి రమాదేవి, బస్వరాజు కుమారస్వామి, కొక్కుల సతీష్‌, కటకం విజయ్‌కుమార్‌, అంజన్న, ప్రసన్న, కా వటి రాజుయాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.