తెగించికొట్లాడుడు తెలంగాణ రక్తంలోనే ఉంది


` కేంద్ర కక్షపూరిత వైఖరిపై గళం విప్పండి
` టీఆర్‌ఎస్‌ ఎంపీలకు కేసీఆర్‌ దిశానిర్దేశం
` రాష్ట్రంపై కక్ష కట్టిన మోడీ ప్రభుత్వం
` అభివృద్ధిని అడ్డుకునే కుతంత్రాలు
` తెలంగాణకు వచ్చిన నిధులెన్నో తేల్చాలి
` ఇక్కడి నుంచి పన్నుల రూపంలో వెళ్లిందెంతో చెప్పాలి
` ఆర్థిక అంశాలను లీక్‌ చేస్తున్న బిజెపి నేతలు
` అంశాలవారీగా పార్లమెంట్‌ వేదికగా కేంద్రాన్ని నిలదీయండి
` అవసరమైతే నేనూ ఢల్లీికి వస్తా..
` అయినవారికి అప్పనంగా దోచిపెట్టేందుకే విద్యుత్‌ సంస్కరణలు
` ఎఫ్‌.ఆర్‌.బి.ఎం పరిమితులను కుదించి, నడ్డి విరిచే కుట్ర
` కేంద్రానికి ఒకమాదిరి, రాష్ట్రాలకు మరోమాదిరి నిబంధనలా?
` మోడీలాగా.. ఏ ప్రధానీ ప్రభుత్వరంగ సంస్థలను తెగనమ్మలేదు
` తెలంగాణ రైతుల ధాన్యాన్ని కేంద్రం కొనకపోవడం దుర్మార్గమే
` బెంగాల్లో లాగా ఉపాధిహావిూని ఆపేసేందుకు కేంద్రం కుట్రలు
` బీజేపీని ప్రజా కోర్టులో దోషిగా నిలబెట్టాలి
` బీజేపీ మూకస్వామ్యంపై నిరసన గళం వినిపించాలె
` దేశ ఆర్థిక వ్యవస్థ పాతాళంలోకి దిగజారుతోందని వెల్లడి
హైదరాబాద్‌,(జనంసాక్షి):‘‘తెగించి కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది. తెగించి కొట్లాడుడు తెలంగాణ రక్తంలోనే ఉంది. ఏమైతదో ఏమో అనే అనుమానం అక్కర్లేదు. మన పోరాటంలో నిజాయితీ ఉన్నప్పుడు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే మనం పోరాటం చేస్తున్నపుడు ఎందాక పోవాల్నో అందాక పోవాల్సిందే.’’ అని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధిని కేంద్రం ఓర్వలేకపోతోందని అందుకే అడ్డుకుంటోందని సీఎం కేసీఆర్‌ మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ భేటీలో చర్చించారు. ఈ సమావేశంలో పలు అంశాలపై ఎంపీలకు సీఎం దిశానిర్దేశం చేశారు. కేంద్రం కక్షపూరిత విధానాలపై పార్లమెంట్‌లో గళమెత్తాలని ఆదేశించారు. కేవలం 8 రాష్టాల్రే ఎక్కువ శాతం దేశ జీడీపీ కి కంట్రిబ్యూట్‌ చేస్తున్నాయని, అందులో తెలంగాణ ఒకటని తెలిపారు. తెలంగాణ నుంచి 8 ఏళ్లలో కేంద్రానికి వెళ్లింది ఎంతని ప్రశ్నించారు. కేంద్రం నుంచి తెలంగాణకు వచ్చిన నిధులెన్ని?.. ఈ అంశాలపై లెక్కలు తేలాలని కేసీఆర్‌ డిమాండ్‌ చేశారు. ఎన్డీఏ సర్కార్‌పై టీఆర్‌ఎస్‌ ఎంపీలు పోరుకు సిద్ధమతున్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని ఎంపీలకు కేసీఆర్‌ పిలుపునిచ్చారు. తెలంగాణకు నష్టం చేసే విధంగా కేంద్రం అవలంబిస్తున్న విధానాలపై ఉభయ సభల్లో తీవ్ర నిరసన వ్యక్తం చేయాలని ఎంపీలకు కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు. ధాన్యాన్ని కొనకుండా రైతులను, మిల్లర్లను, రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న తీరుపై పోరాడాలని ఎంపీలకు కేసీఆర్‌ సూచించారు. ఉపాధి హావిూ పథకం అమల్లో ద్వంద్వ వైఖరిని నిలదీయాలని పేర్కొన్నారు. రూపాయి పతనంతోపాటు ఆర్థిక రంగంలో కేంద్రం అసంబద్ధ విధానాలపై పార్లమెంటులో నిలదీయాలని కేసీఆర్‌ సూచించారు. తెలంగాణను మోదీ ప్రభుత్వం ఎప్పుడూ ప్రోత్సహించలేదని సీఎం కేసీఆర్‌ విమర్శించారు. నిబంధనల పేరిట ఆర్థికంగా అణచివేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు మోదీ కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణకు వ్యతిరేకంగా దుష్పచ్రారం… భాజపా దిగజారుడుతనానికి నిదర్శనమని సీఎం కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం పట్ల కేంద్రం కక్షపూరిత వైఖరిపై ఉభయసభల్లో గళం విప్పాలని ఎంపీలకు సూచించారు. కేంద్రంపై పోరాటానికి పార్లమెంటు ఉభయ సభలనే వేదికలుగా మలుచుకోవాలని సూచించారు. పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలకు కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు. నిబంధనల పేరిట ఆర్థికంగా అణచివేయాలని చూస్తున్నారని ఆరోపించారు. తెలంగాణకు వ్యతిరేకంగా కేంద్రం తీసుకునే నిర్ణయాలు భాజపా సోషల్‌ విూడియా గ్రూపులకు ఎలా చేరుతున్నాయో సమాధానం చెప్పాలన్నారు. దేశం, రాష్ట్రం మధ్య గోప్యంగా ఉండాల్సినవి లీక్‌ చేస్తున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థిక వ్యవహారాలను లీక్‌ చేయడం నేరపూరిత చర్యగా అభివర్ణించారు. దేశంలోని 22 రాష్టాల్ర అప్పులు తెలంగాణ కన్నా ఎక్కువగా ఉన్నాయని ఎంపీలకు సీఎం వివరించారు. ఎఫ్‌ఆర్‌బీఎం లోబడే ఆర్థిక వ్యవహారాలు నడుపుతోందని ముఖ్యమంత్రి తెలిపారు. ఎనిమిదేళ్లలో ఎన్నడూ ఒక్క పైసా కూడా డిఫాల్ట్‌ కాకుండా తిరిగి చెల్లించిన ట్రాక్‌ రికార్డు తెలంగాణ సొంతమని వెల్లడిరచారు. ఆర్బీఐ వేసే బిడ్లలో తెలంగాణకే ఎక్కువ డిమాండ్‌ పలుకుతున్న విషయం వాస్తవం కాదా అని కేంద్రాన్ని కేసీఆర్‌ ప్రశ్నించారు. రాష్ట్ర ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిని రూ.53వేల కోట్లుగా ప్రకటించి మాట మార్చడమేంటని సీఎం కేసీఆర్‌ ప్రశ్నించారు. రూ.53 వేల కోట్ల నుంచి రూ.25వేల కోట్లకు కుదించడం కుట్ర కాదా అని కేంద్రాన్ని నిలదీశారు. విద్యుత్‌ సంస్కరణల రాష్టాల్రపై ఒత్తిడి తేవడాన్ని పార్లమెంట్‌లో నిలదీయాలని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. నీతి ఆయోగ్‌ సిఫారసులను బుట్టదాఖలు చేయడంపై ప్రశ్నించాలని ఎంపీలకు వివరించారు. దేశంలో ఎక్కడ అభివృద్ధి సాధిస్తున్నా అది దేశ జీడీపీకే సమకూరుతుందని సీఎం కేసీఆర్‌ అన్నారు. దేశ జీడీపీకి ఎక్కువగా కంట్రిబ్యూట్‌ చేస్తున్న ఎనిమిది రాష్టాల్ల్రో తెలంగాణ ఒకటని ముఖ్యమంత్రి వివరించారు. ఎనిమిదేళ్లలో రాష్ట్రం నుంచి కేంద్రానికి పోయింది ఎంత.. తెలంగాణకు కేంద్రం నుంచి వచ్చిన నిధులెన్ని? అనే లెక్కలు చూస్తే సామాన్యులకు కూడా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చేస్తున్న అన్యాయం అర్థమవుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన ఎనిమిదేళ్ల కాలంలో రాష్ట్ర విభజన హావిూలు సహా పలు హక్కులను తొక్కిపడుతున్న బీజేపీ అసంబద్ధ వైఖరిని, కలిసొచ్చే విపక్ష ఎంపీలతో సమన్వయం చేసుకొని ఎండగట్టేందుకు కార్యాచరణపై ఎంపీలతో సీఎం చర్చించారు. సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాల వల్ల దేశం అన్నిరంగాల్లో అభివృద్ధి నిలిచిపోతున్న నేపథ్యంలో, సోయి ఉన్న తెలంగాణ బిడ్డలుగా, భారత పౌరులుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.