తెలంగాణను ఆదర్శంగా తీర్చిదిద్దుతున్న సిఎం కెసిఆర్‌

రైతుబంధుతో రైతన్నల తలరాత మారనుంది: ఎర్రబెల్లి 
జనగామ,మే18(జ‌నం సాక్షి ): సంక్షేమ పథకాలతో దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శ రాష్ట్రంగా నిలుపుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు కొనియాడారు. సీఎం ముందుచూపుతో రైతుల కష్టాలను దూరం చేశాడని తెలిపారు. తెలంగాణ ప్రజానీకం సీఎం కేసీఆర్‌కు అండగా నిలవాలన్నారు. జనగామ జిల్లాలోని దేవరుప్పల మండలం కడవెండి గ్రామంలో రైతుబంధు చెక్కులు, పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు లపువురు స్థానిక నేతలు  పాల్గొన్నారు.ఈ సందర్భంగా  గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో ఇతర పార్టీలకు స్థానం లేదని తేల్చి చెప్పారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో కుదేలైన వ్యవసాయ రంగాన్ని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి.. రైతాంగానికి ఎరువులు, 24 గంటల విద్యుత్‌, పంట పెట్టుబడి అందిస్తున్నారని ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు.
రైతుబంధు పథకంతో రైతులకు మంచి రోజులు రానున్నాయని ఎమ్మెల్యే  అన్నారు.ప్రభుత్వంపై భరోసా పెరిగిందన్నారు. వ్యవసాయం దండగ అన్న రోజుల నుంచి పండుగ అన్న రోజులు తీసుకురావాలన్నాదే సీఎం కేసీఆర్‌ లక్ష్యమన్నారు. కాంగ్రెస్‌ పాలనలోనే రైతులు ఆగమయ్యారని మండిపడ్డారు. రైతులను నాశనం చేసిన ఘనత కాంగ్రెస్‌ నాయకులకే దక్కిందన్నారు. రైతుబంధు పథకంపై ప్రతి పక్షాలు చేస్తున్న విమర్శలను రైతులే తిప్పి కొడుతున్నారన్నారు. ఎరువులు విత్తనాలు, కరెంట్‌ కోసం రైతులు లాఠీ దెబ్బలు తిన్నారన్నారని గుర్తు చేశారు. గత ప్రభుత్వాలకు ముందు చూపు లేకపోవడం వల్లే రైతులు కష్టాలు ఎదుర్కొన్నారని చెప్పారు. ఎరువుల కోరత లేకుండా చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. వ్యవసాయం వదిలి వలసపోయిన రైతులు తిరిగి వ్యవసాయం చేయాలన్నదే సీఎం కేసీఆర్‌ లక్ష్యమన్నారు. అన్నదాతలను అన్ని విధాల ఆదుకునేందుకు 24గంటల కరెంట్‌, పంటలకు గిట్టుబాటు ధర, పెట్టుబడి కల్పించేందుకు సీఎం కృషి చేస్తున్నా రని అన్నారు. పెట్టుబడి కింద ఎకరానికి రూ.8వేలు ఇచ్చిన గొప్ప నేత సీఎం కేసీఆర్‌ అని కోనియాడారు. రూపాయి ఖర్చు లేకుండా ప్రతీ రైతుకు పాస్‌ పుస్తకం అందించిన ఘనత సీఎందే అన్నారు. ప్రతీ వ్యక్తికి రాజకీయాలకతీతంగా సాయం చేసేందుకు తాను ముందుంటా నన్నారు. ప్రతి చెరువును గోదావరి జలాలతో నింపి, 365రోజులు మత్తడి పోయి స్తానన్నారు.