తెలంగాణలో పెరిగిన ఆర్టీసీ ఛార్జీలు

ఆర్డినరీ బస్సుల్లో కిలోవిూటర్‌కు 25 పైసలు

ఇతర బస్సుల్లో 30 పైసలు పెంపు

హైదరాబాద్‌,డిసెంబర్‌1  ( జనం సాక్షి) : తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ ఛార్జీలు పెరుగనున్నాయి. ఆర్డినరీ బస్సుల్లో కిలోవిూటర్‌కు 25 పైసలు, ఇతర బస్సుల్లో 30 పైసలు మేర ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది. ఈ మేరకు ఆర్టీసీ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ కేంద్రం పెట్రో ధరలు పెంచడం వల్లనే పెంపు అనివార్యమయ్యిందని అన్నారు. ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ మాట్లాడుతూ గత నెల ధరల ప్రపోజల్స్‌ను తయారు చేసి సీఎంకు అందించినట్లు తెలిపారు. లాంగ్‌ డిస్టన్స్‌ రూట్‌లలో బస్సులను నడపడం వల్ల లాభాలు వస్తాయని సీఎం సూచించారన్నారు. 14 వందల బస్సులు పూర్తిగా పాడయ్యాయని… వాటి స్థానంలో కొత్త వాటిని కొనాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్డినరీ బస్సులకు 25 పైసలు… ఇతర బస్సులకు 30 పైసలు పెంచాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు బాజిరెడ్డి గోవర్ధన్‌ తెలిపారు.  కేంద్ర విధానాల వల్లే ఆర్టీసీ ఛార్జీలను పెంచాల్సి వస్తోందని మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ తెలిపారు.  కేంద్రం డీజిల్‌, పెట్రోల్‌పై ధరలు పెంచడంతో ఆర్టీసీపై తీవ్ర ప్రభావం పడిరదన్నారు. ప్రభుత్వం ఎంత త్వరగా నిర్ణయం తీసుకుంటే ఆర్టీసీకి అంత మేలని మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ పేర్కొన్నారు. ఆర్టీసీ ఛార్జీల పెంపును ప్రజలు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామని బాజిరెడ్డి గోవర్ధన్‌ పేర్కొన్నారు. ఆర్టీసీ ఛార్జీల పెంపుపై సవిూక్ష సందర్భంగా బాజిరెడ్డి గోవర్ధన్‌ విూడియాతో మాట్లాడారు. ఛార్జీల పెంపు కేంద్రం విధానాల వల్లే ఛార్జీలు పెంచాల్సి వస్తోందని  అన్నారు. డీజిల్‌ ధరల పెరుగుదల ఆర్టీసీకి భారంగా మారిందన్నారు. ఆర్టీసీ రోజుకు 6.8 లక్షల లీటర్ల డీజిల్‌ వినియోగిస్తోందని బాజిరెడ్డి గోవర్ధన్‌ పేర్కొన్నారు.