తెలంగాణలో 40మంది భాజపా స్టార్‌ క్యాంపెయినర్లు

– జాబితాను విడుదల చేసిన పార్టీ అధిష్టానం
హైదరాబాద్‌, మార్చి26(జ‌నంసాక్షి) :  తెలంగాణలో 17 పార్లమెంట్‌ స్థానాలపై భాజపా అదిష్టానం దృష్టిసారించింది. 17 స్థానాల్లో కనీసం 10 స్థానాల్లోనైనా గెలిచేందుకు భాజపా లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. కాగా తమ లక్ష్యాన్ని నెరవేర్చుకొనేలా.. ప్రజలను ఆకర్షించేందుకు స్టార్‌ క్యాంపెయినర్‌లను రంగంలోకి దింపనుంది.. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల కోసం 40 మంది స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాను ఆ పార్టీ అదిష్టానం విడుదల చేసింది. అందులో ప్రధాని మోదీ, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సహా కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, నితిన్‌ గడ్కరీ, అరుణ్‌ జైట్లీ, సుష్మాస్వరాజ్‌, జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్‌, స్మృతి ఇరానీ తదితరులు ఉన్నారు. వీరితో పాటు పలువురు రాష్ట్ర నాయకులు కూడా ఇందులో ఉన్నారు. అదేవిధంగా రామ్‌లాల్‌, శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, ఉమా భారతి, ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, హేమామాలిని, అరవింద్‌ లింబావాలీ, పి.సుగుణాకర్‌ రావు, పురుషోత్తం రూపాల, సాద్వి నిరంజన్‌ జ్యోతి, సౌధన్‌ సింగ్‌, పీకే కృష్ణదాస్‌, మురళీధర్‌ రావు, రాంమాధవ్‌, సయ్యద్‌ షహనవాజ్‌ హుస్సేన్‌, జీవీఎల్‌ నరసింహారావు, సురేశ్‌ ప్రభు, కె.లక్ష్మణ్‌, బండారు దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి, పేరాల శేఖర్‌ రావు, స్వామి పరిపూర్ణానంద, ఎన్‌.రామచంద్రరావు, రాజాసింగ్‌, ప్రేమేందర్‌ రెడ్డి, చింతా సాంబమూర్తి, శ్రీనివాసులు, ఎండల లక్ష్మీనారాయణ, చింతల రామచంద్రా రెడ్డి, పి.మోహన్‌రెడ్డి, ఆకుల విజయకు ఈ జాబితాలో చోటు కల్పించారు. వీరంతా తెలంగాణ రాష్ట్రంలోని 17 పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో భాజపా అభ్యర్థుల గెలుపుకోసం ప్రచారం నిర్వహించనున్నారు.