తెలంగాణా తేజం పూర్ణ గాధ తెరకెక్కిన వేళ…

– తెరవెనుక సూత్రధారికి అభినందన మందారమాల
– గురుకులాల మార్గదర్శి మన ప్రవీణుడు…
– వెండి తెరపై బతుకు చిత్రం!
– గురుకులాల గతి మార్చిన ఐపీఎస్‌
– ప్రవీణ్‌ రాకతో కార్పొరేట్‌ స్థాయికి టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌లు
– విద్యార్థుల జీవితాల్లో కొత్త వెలుగులు

డాక్టర్‌ ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌ కుమార్‌.. నిఖార్సయిన పోలీస్‌ ఆఫీసర్‌. విధి నిర్వహణలో క్రమశిక్షణకు మారుపేరు. హార్వర్డ్‌లో మాస్టర్స్‌ పూర్తి చేసిన విద్యా స్వాప్నికుడు. తాను ఎక్కడి నుంచి వచ్చానో అలాంటి వారికోసం ఎదైన చేయాలనే చింతనా పరుడు. సమాజం ఈసడింపులు ఎదుర్కొంటోన్న అణగారిన వర్గాల జీవితాల్లో వెలుగులు ప్రసరింపజేసేందుకు చదువే ఏకైక ఆయుధమని నమ్మిన అధికారి. ఆ చదువును అట్టడుగు వర్గాలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అహరహం శ్రమిస్తోన్న శ్రామికుడు. ఆయన స్వప్నం ఇప్పటికే అద్భుతమైన ఫలితాలను అందిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్టు అంత ఖ్యాతిని ఎస్సీ గురుకులాలు సొంతం చేసుకున్నాయంటే అందులో ప్రవీణ్‌కుమార్‌ కఠోర శ్రమ దాగుంది. ఎస్‌ ఆర్‌ శంకరన్‌ ఆలోచనల్లోంచి పురుడుపోసుకున్న గురుకులాలు ప్రవీణ్‌కుమార్‌ నేతృత్వంలో కార్పొరేట్‌ విద్యాలయాలను సైతం సవాల్‌ చేస్తున్నాయి. నిజంగా గురుకులాల చరిత్రను ప్రవీణ్‌కు పూర్వం.. ప్రవీణ్‌ తర్వాత అని చెప్పుకునే స్థాయిలో ఆయన తపన ప్రస్ఫుటమవుతోంది.

ఎన్‌టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పురుడు పోసుకున్న సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలు కొన్ని దశాబ్దాల పాటు అవస్థల్లోనే కొట్టుమిట్టాడాయి. చదు వుకోవడానికి కనీస సౌకర్యాలు లేని దుర్భర స్థితిలో మగ్గు తోన్న నిరుపేద దళిత, బహుజన కుటుంబాల్లోని పిల్లలకు ఆ మాత్రం చదువును, కాసింత తిండిని పెట్టి చదువు చె ప్పించే గురుకులాలపై అప్పట్లో ప్రజల్లో ఎంతో ఆదరా భిమానులు ఉండేవి. అలాంటి అరకొర సౌకర్యాలున్న గురు కులంలో ఆర్‌ ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ తల్లిదండ్రులు ఉపాధ్యా యులు. అదే పాఠశాలలో చదివి ఇండియన్‌ సివిల్‌ సర్వీసెస్‌లో రెండో అత్యున్నత సర్వీస్‌ అయిన ఐపీఎస్‌ను సొంతం చేసుకున్నారు ప్రవీణ్‌కుమార్‌. పోలీస్‌ అధికారిగా శాంతిభద్రతల పరిరక్షణలో తనదైన ముద్రను చాటుకు న్నారు. ప్రఖ్యాత హార్వర్డ్‌ యూనవర్సీటీ నుంచి మాస్టర్స్‌ను అందుకున్న ఆయన తన చిరకాల స్వప్నాన్ని నెరవ ేర్చుకున్నారు. తాను ఎక్కడి నుంచి వచ్చానో.. ఇప్పటికీ అ లాంటి దుర్భర పరిస్థితులే ఎదుర్కొంటోన్న అణగారిన వర్గా ల వారి జీవితాల్లో కొత్త వెలుగులు తీసుకురావాలనే తలం పుతో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్‌. కిరణ ్‌కుమార్‌రెడ్డికి తన ఆకాంక్షను చెప్పారు ప్రవీణ్‌కుమార్‌. ఆయన అభీష్టాన్ని నెరవేరుస్తూ ఆంధ్రప్రదేశ్‌ ఎస్సీ గురుకులా విద్యాలయాల సంస్థకు కార్యదర్శిగా నియమించారు. ప్రవీణ్‌ రాకతో గురుకులాల తీరే మారిపోయింది. అప్పటి వరకు సమస్యల సుడిగుండంలో చిక్కుకుపోయిన గురుకులాల స్వరూపమే మారిపోయింది.ఐపీఎస్‌ అధికారి.. క్రమశిక్షణకు మారు పేరు.. స్వయంగా తాను ఆచరించే ఇతరులకు చెప్పే ముక్కుసూటితనం.. వెరసి గురుకులాల స్వరూప స్వభావాల్లో పెనుమార్పులు. తమ జీవితాలు ఇంతేనా అని నిర్వేదంలో కూరుకుపోయిన అణగారిన వర్గాల జీవితాల్లో కొత్త వెలుగులు. మొదట్లో సంస్కరణలకు యథావిధిగా కాసింత వ్యతిరేకతలు ఎదురైనా ఉన్నతమైన లక్ష్యం ముందు అవన్నీ చిన్నబోయాయి. గురుకులాల కరికులమ్‌లోనూ చెప్పుకోదగ్గ మార్పులు వచ్చాయి. ఒకానొక దశలో ప్రవీణ్‌ నిర్ణయాలను తప్పుబట్టిన వారే ఆయన చూపిన తోవ అనుసరణీయమంటూ వెంట నడవడం మొదలు పెట్టారు. విద్యావిధానంలో స్పష్టమైన మార్పులు తీసుకువస్తూనే విద్యార్థుల జీవితాల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడంపై ఆయన దృష్టి సారించారు. ఈక్రమంలోనే వందలాది మంది ప్రతిభావంతులైన విద్యార్థులు ఆయా రంగాల్లో మిగతా సంస్థల విద్యార్థులకు పోటీదారులయ్యారు. మలావత్‌ పూర్ణ, ఖమ్మం జిల్లాకు చెందిన మరో విద్యార్థి సందనపల్లి ఆనంద్‌ కుమార్‌తో కలిసి ప్రపంచంలోనే ఎత్తయిన ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించింది. ఇందుకు సంస్థ కార్యదర్శి డాక్టర్‌ ఆర్‌ ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ పట్టుదల, తెగువ, పోరాట పటిమ ఎంతో కారణం.నిజామాబాద్‌ జిల్లా సిరికొండ మండలం పాకాల గ్రామానికి చెందిన మలావత్‌ లక్ష్మి, దేవిదాస్‌ దంపతులకు 2000 జూన్‌ 10న జన్మించిన మలావత్‌ పూర్ణ ప్రస్తుతం నిజామాబాద్‌ జిల్లాల్లోని ఎస్సీ గురుకులంలో ఇంటర్మిడియెట్‌ మొదటి సంవత్సరం పూర్తి చేసింది. 2014 మే 25న మరో గురుకుల విద్యార్థి ఆనంద్‌తో కలిసి ఆమె మౌంట్‌ ఎవరెస్టు శిఖరంపై భారత జాతీయ పతాకంతో పాటు గురుకుల జెండాను రెపరెపలాండించింది. తద్వారా మౌంట్‌ ఎవరెస్టును అధిరోహించిన అత్యంత పిన్న వయస్కురాలిగా గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో తన పేరును నమోదు చేసుంది. పూర్ణ 13 సంవత్పరాల పది నెలల వయసులో ఎవరెస్టుపై కాలు మోపగా ఆమె కన్నా ముందు 13 సంవత్పరాల 11 నెలల వయసులో జోర్డాన్‌ రొమెరో పేరిట ఉంది.పూర్ణ సాధించిన అసాధారణమైన విజయాన్ని వెండితెరకెక్కించారు ప్రఖ్యాత దర్శక నిర్మాత రాహుల్‌ బోస్‌. ‘పూర్ణ: కరేజ్‌ హేజ్‌ నో లిమిట్‌’ పేరుతో ఆయన తీసిన సినిమా శుక్రవారం విడుదలై విమర్శకుల మన్ననలు అందుకుంటోంది. ప్రపంచానికే సవాల్‌గా నిలిచే ఎవరెస్టు శిఖరంపై మారుమూల గిరిజన గూడెంలో పుట్టిన బాలిక అడుగు పెట్టడం, అందుకోసం ప్రాణాన్ని పణంగా పెట్టి చేసిన కఠోర శ్రమను దర్శకుడు కల్లకు కట్టారు. పూర్ణ పాత్రలో అదితి ఇనామ్‌దార్‌ ఆకట్టుకున్నారు. ఐపీఎస్‌ అధికారి ప్రవీణ్‌ కుమార్‌ పాత్రను దర్శక నిర్మాత రాహుల్‌ బోస్‌ పోషించారు. చిన్ననాటి నుంచి గురుకులంలో చురుకైన పాత్ర పోషించే పూర్ణలోని ఉత్సాహం ఐపీఎస్‌ అధికారి ప్రవీణ్‌ దృష్టిలో పడటమే ఆమె జీవితానికి టర్నింగ్‌ పాయింట్‌. ఆ బాలికను ఎలాగైనా ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించే స్థాయికి తీసుకెళ్లాలని సంకల్పించిన ఆ అధికారి.. అన్ని విధాలా సాయపడతారు. మరి ఎవరెస్టు అంటే మాటలా? ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం. ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకుని సాహసం చేయాల్సి ఉంటుంది. అంతటి మనోధైర్యాన్ని.. పూర్ణ ఎలా కూడగట్టుకోగలింది? అందుకు ఎలాంటి కసరత్తులు చేసింది? ఎవరెస్టు పైకి ఆమె సాహస ప్రయాణం ఎలా సాగింది అనే అంశాలను వాస్తవికంగా చిత్రీకరించారు రాహుల్‌బోస్‌. భువనగిరి ఖిల్లా.. డార్జిలింగ్‌ కొండలు.. నేపాల్‌ పర్వతాలు.. ఇలా ఎన్నో ఎత్తైన కొండలను అధిరోహించడానికి పూర్ణ పడే కష్టమే కాదు ఆమెలో అంతటి సంకల్పాన్ని నూరిపోయడానికి ప్రవీణ్‌ తపను హృద్యంగా తెరకెక్కించారు దర్శకులు.తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కేజీ టు పీజీ విద్యలో భాగంగా గురుకులాల పాత్ర పెరిగింది. ఇందుకు ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌కుమార్‌ సాగించిన స్ఫూర్తిదాయక ప్రయత్నమే కారణం. ఇందులో ఎవరికి ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. స్వయంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఇదే విషయాన్ని పలు సందర్బాల్లో వెల్లడించారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున గురుకులాలను ఏర్పాటు చేస్తున్నారు. వాటి నిర్వహణ బాధ్యతలను ప్రవీణ్‌కుమార్‌ చేతిలో పెడుతున్నారు. అది ఆయనలోని తపనకు లభిస్తున్న గుర్తింపు. గురుకులాలు మున్ముందు అద్భుతమైన విజయాలను ఆవిష్కరిస్తాయని ప్రవీణ్‌ ధీమాగా చెప్తోన్నారు. నీట్‌, ఐఐటీ జీఈఈ, ఎంసెట్‌, ఐసెట్‌ సహా జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లోనూ గురుకులాల విద్యార్థులు మెరుగైన ప్రతిభ కనబరుస్తున్నారు. విద్యార్థుల్లో ఆంగ్ల భాష సామర్థ్యం, గణితం, భౌతికశాస్త్రంపై పట్టుకోసం ప్రత్యేకంగా శిక్షణలు ఇప్పిస్తున్నారు ప్రవీణ్‌. మార్కుల కోసమే కాకుండా విద్యార్థుల వికాసం కోసమే గురుకులాలు బోధన సాగిస్తున్నాయనడంలో ఎవరికీ అతిశయోక్తి లేదు. ఇది ముమ్మాటికీ ప్రవీణ్‌ పనితీరుకు దర్పణమే…ravi-tejam