తెలంగాణ అభివృద్దిని అడ్డుకునే కుట్ర

ఆంధ్ర పార్టీల పెత్తనాన్ని అడ్డుకోవాలి

ప్రచారంలో నిరంజన్‌ పిలుపు

వనపర్తి,నవంబర్‌14(జ‌నంసాక్షి): తెలంగాణ అభివృద్ధిని ఆడుగుడునా అడ్డుకుంటున్న ఆంధ్ర పార్టీలను ఈ ఎన్నికల్లో తుదముట్టించాలని వనపర్తి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి నిరంజన్‌ రెడ్డి అన్నారు. కూటమి పేరుతో మరోమారు తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెట్టే కుట్ర సాగుతోందని, దానిని అడ్డుకోవాలని అన్నారు. మన రాష్ట్రాన్ని మనమే పాలించుకుంటుంటే ఆంద్రోళ్ల పెత్తనం కోసం ఆరాట పడుతున్నారని అన్నారు. స్వరాష్ట్రంలో కూటమి కుట్రలను చిత్తులు చేయాలన్నారు. తెలంగాణ పండుగలైన బతుకమ్మ పండగకు ఆడబిడ్డలకు చీరలు ఇద్దామని రూ.80 కోట్లు వె చ్చించి చీరలు కొనుగోలు చేస్తే కాంగ్రెస్‌ ఆడ్డుకుందన్నారు. ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలుపొందగానే చీరలు అందించే కార్యక్రమం ప్రారంభిస్తామన్నారు. ప్రజలు కోరుకున్న పాలన అందించే కేసీఆర్‌నే మళ్లీ సీఎంగా చేస్తామని ప్లలె ప్లలె ప్రతినబూనడం అనందంగా ఉందన్నారు. మత్య్సకారులు, గొల్ల, కురుమల వృత్తికి చే యూతనివ్వడం సంతోషకరమన్నారు.

ప్రతీ గ్రామంలో ఉన్న చెరువును నింపుతున్నామని అన్నారు. అర్హులైన వారందరికీ వారి వారి సొంత స్థలాల్లోనే డబుల్‌బెడ్‌ రూం ఇండ్లు నిర్మించి ఇస్తామని అన్నారు. ప్రజలంతా గమనించి కారు గుర్తుకు ఓటు వేయాని పిలుపునిచ్చారు. కేసీఆర్‌ కిట్‌, ఆడపిల్లలకు ఆరోగ్యకిట్లు, ఎదిగిన అడబిడ్డలకు కల్యాణలక్ష్మి ద్వారా చేయూతనిచ్చిన ప్రభుత్వాలు ఇంత వరకూ లేవన్నారు. ఇప్పటికీ రైతులకు పంటల పెట్టుబడి ఇవ్వొద్దని కాంగ్రెసోల్లు అడ్డుపడుతూ కోర్టులకు వెళ్తున్నారని, ఈ విషయాన్ని ప్రజలు గ మనించాలన్నారు. 57 ఏండ్లకే వృద్దాప్య పింఛన్‌తో పాటు నిరుద్యోగ యువతకు ఉద్యోగం వచ్చే వరకూ నెలకు రూ. 3016 జీవనభృతి అందించేందుకు కేసీఆర్‌ సిద్ధంగా ఉన్నారని అన్నారు.