తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విడుదల

హైదరాబాద్‌: తెలంగాణ ఇంటర్మీడియెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ప్రథమ, ద్వితీయ ఇంటర్‌ పరీక్ష ఫలితాలను ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి బి.జనార్దన్ రెడ్డి విడుదల చేశారు. ప్రథమ సంవత్సరంలో 59.8 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా.. ద్వితీయ సంవత్సరంలో 65శాతం ఉత్తీర్ణత నమెదైనట్టు చెప్పారు. ఈ ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. 76శాతంతో మేడ్చల్‌ జిల్లా అగ్రస్థానంలో నిలవగా.. రంగారెడ్డి జిల్లా 71శాతంతో రెండో స్థానంలో నిలిచింది. ఆఖరు స్థానంలో మెదక్‌ జిల్లా (29శాతం) నిలిచింది. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షలను సుమారు 4.52 లక్షల మంది విద్యార్థులు రాయగా.. 4.90లక్షల మంది విద్యార్థులు ద్వితీయ సంవత్సర పరీక్షలు రాసిన విషయం తెలిసిందే.