తెలంగాణ నుంచే ఎక్కువ బియ్యం సేకరణ

న్యూఢల్లీి,డిసెంబర్‌1  ( జనం సాక్షి)  :  తెలుగు రాష్టాల్లో ధాన్యం సేకరణను రాష్ట్ర ప్రభుత్వాలే చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్‌ కంటే తెలంగాణ నుంచి ఎక్కువ బియ్యం సేకరించినట్టు కేంద్రం వెల్లడిరచింది. లోక్‌సభలో టీడీపీ ఎంపీ కేశినేని నాని అడిగిన ప్రశ్నకు కేంద్రం రాతపూర్వక సమాధానమిచ్చింది. 2018`19లో ఏపీలో 48.06 లక్షల మెట్రిక్‌ టన్నులుండగా, తెలంగాణలో 51.90 లక్షల మెట్రిక్‌ టన్నులు… 2019`20లో ఏపీ నుంచి 55.33 లక్షల మెట్రిక్‌ టన్నులు, తెలంగాణ నుంచి 74.54 లక్షల మెట్రిక్‌ టన్నులు సేకరించినట్టు తెలిపింది. 2020`21లో ఏపీ నుంచి 56.67 లక్షల మెట్రిక్‌ టన్నులు, తెలంగాణ నుంచి 94.53 లక్షల మెట్రిక్‌ టన్నులు సేకరించినట్టు కేంద్రం వెల్లడిరచింది.