తెలంగాణ పథకాలపై ఢిల్లీలో ఆరా

కంటివెలుగులో విపక్షాలకు చూపు తెప్పించాలి

ఎంపి జితేందర్‌ రెడ్డి

మహబూబ్‌నగర్‌,ఆగస్ట్‌13(జ‌నం సాక్షి): భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో జరగనంతా.. అభివృద్ధి తెలంగాణలోజరిగిందని ఎంపీ జితేందర్‌ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఢిల్లీలో అడిగి తెలుసుకుంటున్నారని తెలిపారు. మహబూబ్‌ నగర్‌ జిల్లా నారాయణ పేటలో పర్యటించిన ఎంపీ జితేందర్‌ రెడ్డి.. పలు అభివృద్ధి పనుల్లో పాల్గొనడంతో పాటు హారితహారంలో భాగంగా మొక్కలను నాటారు. సీఎం కేసీఆర్‌ రైతుబంధు, రైతు భీమా పథకాల ద్వారా అన్నదాతలను అదుకుంటున్నారని చెప్పారు. అనేక పథకాలు దేశానికి ఆదర్వంగా నిలిచాయన్నారు. నాలుగేళ్లలో అనేక పథకాలతో ప్రజల స్థితిగతులు మారయన్నారు. అలాగే కంటివెలుగు కూడా పేదలకు వరం కానుందని ఎంపి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 15 నుంచి ప్రారంభిస్తున్న కంటి వెలుగు కార్యక్రమంలో తొలుత ప్రతిపక్ష పార్టీల నాయకులు పరీక్షలు చేసుకోవాలని, తద్వారా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులు కళ్లారా చూడడానికి వీలవుతుందని అన్నారు.హరితహారం బాగా నడుస్తోందని, ప్రజల్లో చైతన్యం వచ్చిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఒక రైతుగా రైతులు పడుతున్న కష్టాలను గుర్తించి వారి శ్రేయస్సు కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారన్నారు. నాలుగేళ్లలోనే ప్రపంచ పటంలో తెలంగాణకు గుర్తింపు తీసుకువచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే సాధ్యమైందన్నారు. దేశంలో మరే రాష్ట్రంలో ఇంతటి అభివృద్ది జరగలేదన్నారు. 58 లక్షల మంది రైతులకు భీమా సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు.నారాయణపేటలో పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. దామరగిద్ద మండలాన్ని పేట మార్కెట్‌యార్డు పరిధిలోకి తీసుకుచ్చేందుకు కృషి చేస్తానన్నారు.