తెలంగాణ భవిష్యత్‌ను నిర్దేశించే ఎన్నికలివి

అభివృద్దికి కేరాఫ్‌ తెలంగాణ
కోటి ఎకరాలకు సాగునీరు రావాలంటే కెసిఆర్‌ ఉండాల్సిందే
హుజూరాబాద్‌లో ప్రజలతో పెనవేసుకుని పోయా: ఈటల
కరీంనగర్‌,అక్టోబర్‌10(జ‌నంసాక్షి): ఈ ఎన్నికలు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించే ఎన్నికలని, నాయకులు, కార్యకర్తలు ప్రణాళికతో, బాధ్యతతో పనిచేయాలని మంత్రి ఈటల రాజేందర్‌ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, ప్రాజెక్టులు పూర్తి కావాలంటే, కోటి ఎకరాలకు సాగునీరు రావాలంటే టీఆర్‌ఎస్‌కే ఓటు వేయాలని పేర్కొన్నారు. నాలుగున్నర సంవత్సరాల పాలనలో తెలంగాణను దేశంలోనే మొదటి స్థానంలో నిలిపిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. అధికార దాహంతోనే మహాకూటమి నేతలు ఆరాటపడుతున్నారనీ, బంగారు తెలంగాణ సాధన కోసమే తమ పోరాటమని పేర్కొన్నారు.
హుజూరాబాద్‌ నియోజకవర్గం అభివృద్ధికి కేరాఫ్‌ అడ్రస్‌ అని ఈటల అన్నారు. హుజూరాబాద్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి ఈటల మాట్లాడుతూ..’హుజూరాబాద్‌ ప్రజల జీవితాలతో పెనవేసుకున్న వ్యక్తిని నేను. ఉద్యమం నుంచి ఇప్పటివరకు ప్రజల నమ్మకాన్ని ఎప్పుడూ కూడా వమ్ము చేయలేదు. గ్రామాల్లో ఒక్క ఓటు కూడా ఇతర పార్టీలకు వెళ్లదని’ ధీమా వ్యక్తం చేశారు. మంత్రి ఈటలతోపాటు
ఈ సందర్భంగా ఈటల  మాట్లాడుతూ ఎన్నికల యుద్ధంలో టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు వీర సైనికుల్లా పనిచేసి  గులాబి జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు ఏదోవిధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో లబ్ది పొందడంతో గ్రామాల్లో కుల సంఘాలు, వృత్తి సంఘాలు, రైతులు, వ్యాపారవేత్తలు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని బలపరుస్తున్నారనీ, కారు గుర్తుకే ఓటు వేస్తామని ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్‌ పాలనలో ఏమాత్రం అభివృద్ధి చెందలేదని, టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాతమాత్రమే తెలంగాణ గతంలో ఎన్నడూ చూడని విధంగా  అభివృద్ధి చెందిందన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో రైతులకు 24గంటల కరెంట్‌, రైతుబీమా, భూ ప్రక్షాళన, కొత్త జిల్లాలు, గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు వంటి భృహత్తర కార్యక్రమాలు చేసిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల అప్పును టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి రాగానే మాఫీ చేసిందన్నారు.  డబుల్‌ బెడ్‌ రూం ఇండ్ల నిర్మాణ పనులు చురుకుగా జరుగుతున్నాయన్నారు. సీమాంధ్ర ప్రభుత్వంలో ఏ ఎమ్మెల్యే కూడా అభివృద్ధి నిధులు కేటాయించలేదని, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో స్వప క్షం, ప్రతిపక్షం తేడా లేకుండా నియోజక వర్గాల అభివృద్ధికి నిధులు మంజూరు చేశారన్నారు.