తెలంగాణ సంస్కృతి ,సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ

ఎల్బీ నగర్ (జనం సాక్షి  ) న్యూ మారుతీ నగర్ కమ్యూనిటీ భవనము వద్ద తెలంగాణ సంస్కృతి ,సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఎంగిలి పూల బతుకమ్మ ను ప్రారంభించిన కమిటీ సభ్యులుప్రారంభించారు .మహిళలు ఈ కార్యక్రమములో మొదటిరోజు పెద్ద ఎత్తున పాల్గొని గౌరీదేవిని తమ ఆట పాటలతో రంగు రంగుల పూలతో బతుకమ్మలను పేర్చి సంతూషముగా పాటలు , ఆటలు ఆడారు .ఎంగిలి పూలతో ప్రారంభమైయ్యే వేడుకలు తొమ్మిడి రోజులు ఈ వేడుకలు జరుపుకొని సద్దుల బతుకమ్మతో ముగిస్తారని తెలిపారు  . వాడే పూలు కూడా ఔషధ గుణాలుండే తంగేడు ,గునుగు ,బంతి ,చామంతి ,కట్ల ,సంపంగి ,మల్లె ,మందార ,పారిజాతం ,కమలం ,తమర ,గన్నేరు ,గులాబీ పట్టుకుచ్చులు పూలతో చక్కగా బతుకమ్మలను పేర్చి బతుకమ్మ సంబరాలను జరుపుకుంటారని అన్నారు .   .ఈ కార్యక్రమములో జీహెచ్ఎంసీ   ఎల్ బి నగర్ హార్టికల్చర్  లయన్స్ క్లబ్ సహకారముతో పాల్గొన్న మహిళలకు ప్లాస్టిక్ మీద అవగాహన వాటిని నివారించి పర్యావరణాన్ని కాపాడే దిశగా పేపర్ బ్యాగులను ఉపయోగించాలని సూచించారు . కమిటీ సభ్యుల సహకారముతో గోరింటాకు మొక్కలను పంపిణి చేసారు .లయన్స్ క్లబ్ తరపున లయన్ సైకం రేణుక రెడ్డి లయన్ డాక్టర్ బి విజయ్ రంగ పాల్గొన్నారు .అధ్యక్షులు నోముల కృష్ణ మూర్తి ,కార్యదర్శి  రేపల్లె ప్రభాకర్ రావు ,కోశాధికారి  బసవ రాజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ రేపటి నుండి సంక్షేమ భవనంలో ఘనంగా దసరా నవరాత్రి ఉత్సవాలు కమిటీ సభ్యుల సహకారముతో  శ్రీ రేలంగి ఫణి శర్మ పంతులు  ఆధ్వర్యములో  శ్రీ రుద్ర సహిత లలిత చండి యాగము  ఘనంగా దేవి నవరాత్రులు  జరుగుతాయని  కాలనీ వాసులందరు పూజ కార్యక్రమాలలో పాల్గొనాలని విజ్ఞప్తి చేసారు .