తెలంగాణ సమస్యలపై గళం విప్పుతాం

– పెండింగ్‌ ప్రాజెక్టుల గురించి అడుగుతాం
– తెరాస లోక్‌ సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు
దిల్లీ,నవంబర్‌ 17(జనంసాక్షి):పార్లమెంట్‌ సమావేశాల్లో విభజన సమస్యలపై చర్చకు అవకాశమివ్వాలని అఖిలపక్ష భేటీలో కేంద్రాన్ని కోరినట్లు తెరాస లోక్‌ సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు తెలిపారు . అఖిలపక్ష భేటీ అనంతరం విూడియాతో ఆయన మాట్లాడారు. సమావేశాల్లో 27 బిల్లులు ప్రవేశపెడతామని ప్రభుత్వం తరపున జాబితా ఇచ్చారని నాచూ తెలిపారు . బిల్లులు ప్రవేశపెట్టి ఆమోదించడమే కాకుండా దేశంలోని ప్రజాసమస్యల పైనా చర్చ జరగాలని కోరామన్నారు . వారానికి ఒక్కరోజైనా 192వ నిబంధన కింద ప్రజా సమస్యలపై చర్చించాలని కోరినట్లు నామా తెలిపారు . కాలుష్యం, నిరుద్యోగం, రైతుల సమస్యలపై చర్చ జరగాలన్నారు. విభజనచట్టం 1 ప్రకారం తెలంగాణకు పెండింగ్‌ లో ఉన్న అంశాలను సమావేశాల్లో లేవనెత్తుతామని ఆయన వివరించారు .సీఎం కేసీఆర్‌ స్వయంగా ఎన్నో అంశాలపై కేంద్రానికి విజ్ఞప్తులు అందజేసినా స్పందన లేదని .. చేస్తాం అంటూ పనులను పెండింగ్‌ లో ఉంచుతున్నారని నామా ఆక్షేపించారు . కొత్త రాష్ట్రానికి సహకారం అందించాల్సిన కేంద్రం.. అన్ని అంశాలను పెండింగ్‌ లో పెడుతోందని ఆరోపించారు .