తెలంగాన విమోచనపై మౌనం వీడాలి

రంగారెడ్డి,సెప్టెంబర్‌13(జ‌నంసాక్షి): తెలంగాణ ప్రజలు బానిస బతుకుల నుంచి విముక్తి పొందిన సెప్టెంబర్‌ 17న విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని బిజెపి జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి అన్నారు. అధికారంలోకి రాకముందు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తామని ప్రకటించిన కేసీఆర్‌, ఇపుడు ఈ విషయమై మాట్లాడంలేదని ఆరోపించారు. బిజెపి అధ్యక్షుడు లక్ష్మణ్‌ ఇటీవల చేపట్టిన యాత్ర ద్వారా తెలంగాణ విమోచనను ప్రజలకు వివరించారని అన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ప్రదర్శించారు. గోల్కొండ కోటలో సెప్టెంబర్‌ 17 ఉత్సవాలు జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సెప్టెం బర్‌ 17ను అధికారికంగా జరిపేలా కేంద్రం ఆదేశాలు ఇవ్వాలనిఅన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో గోల్కొండ కోటలో విమోచన ఉత్సవాలు జరపాలని అన్నారు. కర్నాటక, మహారాష్టాల్ల్రో విమోనను అధికారికంగా నిర్వహిస్తున్నా తెలంగాణ ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉండాలనుకుంటుందని ఆయన ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎంఐఎం నేతలకు భయపడుతుందని ఆయన ఆరోపించారు. తెలంగాణ విమోచన పరిణా మాలను పాఠ్యాంశంలో చేర్చాలని ఆయన డిమాండ్‌ చేశారు.