తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి అర్హులైన మహిళలు ప్రతి ఒక్కరు బతుకమ్మ చీరలు తీసుకోవాలి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

ఎల్బీ నగర్ (జనం సాక్షి  )తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన బతుకమ్మ చీరల పంపిణి చేనేత కళకారుల జీవితాల్లో వెలుగు నింపుతోంది అని ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి  అన్నారు. చంపాపేట్ డివిజన్ పరిధిలోని బైరామల్ గూడా మహిళా మండలి నందు జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా  దేవిరెడ్డి సుధీర్ రెడ్డి  పాల్గొన్నారు.పలువురు మహిళలకు బతుకమ్మ చీరలు అందజేశారు.ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి  మాట్లాడుతూ..మన ఆడపడుచులను తోబుట్టువులుగా భావించి బతుకమ్మ పండుగ కానుకగా చీరలను పంపిణీ చేయడం నిజంగా గర్వించదగ్గ విషయం అని తెలిపారు..తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి అర్హులైన మహిళలు ప్రతి ఒక్కరు బతుకమ్మ చీరలు తీసుకోవాలని కోరారు.బతుకమ్మ  పండుగ కానుకగా ముఖ్యమంత్రి కేసిఆర్  తమకు మంచి చీరేలను అందిస్తున్నారని ఆడపడుచులు సంబరపడుతున్నారని అన్నారు.మహిళల కోసం కేవలం తెలంగాణ రాష్ట్రంలొనే కళ్యాణ లక్ష్మీ,షాధిముబారక్ లాంటి పథకాలు అమలు చేస్తున్నారు అని అన్నారు.తెలంగాణ ఆడపడుచులు ఎంతో ఉత్సాహంగా జరుపుకునే బతుకమ్మ పండుగను అధికారికంగా నిర్వహిస్తున్న ప్రభుత్వం వారికి ఏటా కొత్త చీరలను రంగురంగులతో కూడిన చేనేత చీరలను డిజైన్ చేయించి పంపిణీ చేస్తుంది అని అన్నారు.బతుకమ్మ చీరల కోసం వచ్చే మహిళలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.ఇట్టి కార్యక్రమంలో ఏల్.బి.నగర్ సర్కిల్ కమిషనర్ సురేందర్ రెడ్డి,సీనియర్ నాయకులు గజ్జల.మధుసూదన్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్  సుంకోజు.కృష్ణమాచారీ,డివిజన్ అధ్యక్షులు రాజిరెడ్డి,రోజారెడ్డి,మల్లేష్ గౌడ్,సూర్యప్రకాష్ గుప్తా,గోపాల్,అనసూయ,సురేందర్ రెడ్డి,బొంబాయి,భానుప్రకాష్,నిశికాంత్ రెడ్డి తదితరులు నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.