తేమలేకుండా పత్తిని మార్కెట్‌కు తీసుకుని రావాలి

ఆరబెట్టిన తరవాతనే పత్తిని  కొనుగోలు చేస్తాం
ఆదిలాబాద్‌,అక్టోబర్‌13(జ‌నంసాక్షి): రైతులు తమ పత్తిని ఆరబెట్టుకొని మార్కెట్‌ యార్డుకు తీసుకరావాలని మార్కెటింగ్‌ ఏడీ శ్రీనివాస్‌ సూచించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తేమ శాతం పై ఇప్పటికే టీవీ , కరపత్రాల పంపిణీ, గ్రావిూణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కార్యదర్శులందరూ పత్తి కొనుగోళ్ల సమయంలో మార్కెట్‌ యార్డుల్లో అందుబాటులో ఉండాలని
సూచించారని అన్నారు. ఆదిలాబాద్‌ మార్కెట్‌ యార్డులో ఈనెల 17 నుంచి పత్తి కొనుగోళ్లను ప్రారంబిస్తున్నట్లు తెలిపారు. పూర్వపు జిల్లాలో 18 మార్కెట్‌ యార్డులు ఉండగా.. ఆదిలాబాద్‌లో 9, నిర్మల్‌లో 5, మంచిర్యాల్‌లో 4, ఆసిఫాబాద్‌లో 4 మార్కెట్‌ యార్డులు ఉన్నాయని తెలిపారు. ముందుగా ఆదిలాబాద్‌ మార్కెట్‌ యార్డులో 17 నుంచి కొనుగోళ్లను ప్రారంభిస్తామని, మిగతా మార్కెట్‌ యార్డుల్లో దసరా అనంతరం కొనుగోళ్లు ప్రారంభం అవుతాయన్నారు. అన్ని మార్కెట్‌ యార్డుల్లో రైతుల సౌకర్యా ర్థం ఏర్పాట్లు పూర్తి చేయాలని కార్యదర్శులను ఆదేశించారు. ఇప్పటికే ఎలక్టాన్రిక్‌  కాంటాలకు మరమ్మతులు చేసి సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. రైతు పత్తిని అమ్ముకోడానికి మార్కెట్‌ యార్డుకు వచ్చే ముందు ఇటీవల జారీ చేసిన గుర్తింపు కార్డు, బ్యాంక్‌ జిరాక్స్‌ కాపీ వెంట తీసుకరావాలన్నారు. కార్డులేని రైతులు ఆధార్‌, ఏఈవోల నుంచి ధ్రువీకరణ పత్రాలను తీసుకరావాల్సి ఉంటుందని తెలిపారు. దళారులు రైతుల పేర్లపై సీసీఐకి పత్తి అమ్మకుండా వీలు ఉంటుందన్నారు. పత్తి విక్రయించిన మూడు రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని చెప్పారు. ప్రతి రైతు వేలి ముద్రను మార్కెట్‌ యార్డులో తీసుకోవడం జరుగుతోందని తెలిపారు. 12శాతం మైచర్‌ వరకు సీసీఐ అధికారులు పత్తిని కొనుగోలు చేస్తారన్నారు. 8శాతం తేమ వస్తే రూ.5,450 క్వింటాల్‌కు మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తారని తెలిపారు. ఆపైన ఒక శాతం తేమ వస్తే రూ.54.50 కోత విధిస్తారన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తాగునీటితో పాటు విశ్రాంతి గదులు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు.