తొలిదశ ప్రాదేశిక నోటిఫికేషన్‌ విడుదల

24 వరకు నామినేషన్లకు అవకాశం
25న నామినేషన్‌ లపరిశీలన..28న ఉపసంహరణ
మే6న తొలిదశ ఎన్నికలు
హైదరాబాద్‌,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి): రాష్ట్రంలో స్థానిక సంస్థల తొలి విడుత ఎన్నికలకు సోమవారం  నోటిఫికేషన్‌ విడుదలైంది. తొలి విడుతలో భాగంగా 32 జిల్లాల్లో 197 జడ్పీటీసీ, 2166 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడుత ఎన్నికల నోటిఫికేషన్‌ జారీతో నామినేషన్‌ పత్రాల స్వీకరణ ప్రారంభమైంది. ఈ నెల 22 నుంచి 24వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. మే 6వ తేదీన పోలింగ్‌ జరగనుంది.  25న నామినేషన్ల పరిశీలన, అదే రోజున బరిలో నిలిచే అభ్యర్థుల వివరాలు ప్రకటిస్తారు. ఈ నెల 26న అభ్యంతరాలను స్వీకరిస్తారు. 27న అభ్యంతరాలను పరిశీలించి 28న మధ్యా హ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పిస్తారు. అదేరోజు బరిలో నిలిచినవారికి ఎన్నికల గుర్తులు ఖరారు చేస్తారు. పార్టీల తరుఫున బీ-ఫాంలు సమర్పించినవారికి ఆయా పార్టీల గుర్తులు కేటాయిస్తారు. ఆ తర్వాతి క్రమంలో స్వతంత్రులకు గుర్తులు ఇస్తారు. ఈ నెల 28 నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు ప్రచారం నిర్వహించుకోవచ్చు. మే 6న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది. నామినేషన్లు తిరస్కరణకు గురైన అభ్యర్థులకు అప్పీల్‌ చేసుకొనే అవకాశం కల్పిస్తున్నారు. జెడ్పీటీసీ అభ్యర్థులైతే కలెక్టర్‌కు, ఎంపీటీసీ అభ్యర్థులైతే ఆర్డీవోలు, సబ్‌కలెక్టర్‌కు అప్పీల్‌ చేసుకోవాల్సి ఉంటుంది. తొలి విడుతలో సోమవారం నుంచి నామినేషన్ల ఘట్టం