తొలి సైబర్‌ నేరగాడు అరెస్ట్‌

వరంగల్‌, మే24(జ‌నం సాక్షి) : ఆన్‌లైన్‌లో బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు దోచుకుంటున్న తొలి సైబర్‌ నేరగాడిని వరంగల్‌ అర్బన్‌ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. తొర్రూర్‌ మండలం వెలికట్టె గ్రామానికి చెందిన గుగులోత్‌ విజయ్‌… గత కొంతకాలంగా బ్యాంకు అధికారినంటూ పలువురు ఖాతాదారులకు ఫోన్లు చేసి వారి ఏటీఎం, సీవీవీ, పిన్‌ నెంబర్లను సేకరించి నగదును కాజేసేవాడు. ఇప్పటికే వరంగల్‌, సైబరాబాద్‌, రాచకొండ, హైదరాబాద్‌ కమిషనరేట్ల పరిధిలో పలు సైబర్‌ నేరాలకు పాల్పడ్డాడు. కాగా… ఈ సైబర్‌ నేరంపై పోలీసులు గత కొంతకాలంగా దృష్టిసారించగా ఎట్టకేలకు విజయ్‌ పట్టుబట్టాడు. ఈ సందర్బంగా అతని నుంచి రూ. 30లక్షల విలువచేసే బంగారం, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
——————————-