దక్షిణాది రాష్టాల్రే బిజెపి టార్గెట్‌

ఓడిన లోక్‌సబ స్థానాలపై గురి
అధికారిక కార్యక్రమాలతో మంత్రుల పర్యటనలు
న్యూఢల్లీి,మే27(జ‌నంసాక్షి): దక్షిణాదిలో పాగా వేయాలనుకుంటున్న బిజెపి ఆయా రాష్టాల్ల్రో అధికారిక కార్యక్రమాలతో పర్యటనలను ఖారరు చేస్తోంది. ప్రధానితో పాటు పలువురు కేంద్రమంత్రులతో పర్యటనలు చేయిస్తున్నారు. ఇందులో భాగంగా మోడీ, అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌ సహా పలువురు కేంద్రమంత్రులు ఇటఈవల వరుసపెట్టి పాల్గొంటున్నారు. ఉభయ తెలుగు రాష్టాల్రతో పాటు తమిళనాడు, కేరళ, ఒడిషా తదితరరాస్ట్రాల్లో పర్యటిస్తున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సన్నాహాలు మొదలుపెట్టిన భారతీయ జనతా పార్టీ గత లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన స్థానాలపైనే ప్రధానంగా దృష్టిసారించింది. పార్టీ బలహీనంగా ఉన్న లోక్‌సభ స్థానాల్లో బూత్‌ స్థాయి నుంచి బలోపేతం చేసే కార్యాచరణను సిద్ధం చేసుకుంది. 2019 ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన 144 లోక్‌సభ స్థానాల్లో సగమైనా గెలుచుకునేలా జూన్‌ ఒకటి నుంచి రంగంలోకి దిగనుంది. దీనికి సంబంధించి రెండ్రోజుల కిందటే పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్‌ షా, పార్టీ ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌ సీనియర్‌ నేతలు, కేంద్ర మంత్రులు, ఆఫీస్‌ బేరర్లకు దిశానిర్దేశర చేశారు. ప్రతి లోక్‌సభ పరిధిలో ఒక సోషల్‌ విూడియా గ్రూప్‌ను సైతం ఏర్పాటు చేస్తున్నారు. ఈ గ్రూప్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌ల వారీగా కులాలు, సమస్యలు, పార్టీల బలహీనతలు వంటి సమాచారాన్ని సేకరిస్తుంది. నియోజకవర్గంలో కులాల సవిూకరణల ఆధారంగా పార్టీ అభ్యర్థిని ఎంపిక చేసేలా పార్టీకి సాయపడుతుంది. లోక్‌సభ సోషల్‌ విూడియా ఇన్‌చార్జి కనీసం 50వేల మందిని ఈ గ్రూపుల్లో చేర్చే బాధ్యత తీసుకోవాలి. డిసెంబర్‌ నాటికే ఈ పక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. మొత్తంగా
ఏడాదిన్నరలో ఈ నియోజకవర్గాల పరిధిలోని 74వేల బూత్‌లను బలోపేతం చేసి సగానికి పైగా సీట్లను గెలుచుకునే వ్యూహాలను బీజేపీ సిద్ధం చేసింది. ముందుగా గుర్తించిన 144 లోక్‌సభ స్థానాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై అంతర్గతంగా ఓ రోడ్‌మ్యాప్‌ను బీజేపీ సిద్ధం చేసింది. మొదటగా ఈ స్థానాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బూత్‌ల వారీగా పార్టీ బలహీనతలకు సంబంధించిన సమాచారం సేకరిస్తారు. ఈ సమాచారం ఆధారంగా మూడు స్థాయిల్లో నేతలు బరిలోకి దిగనున్నారు. మొదటి స్థాయిలో జాతీయ స్థాయి నేతల కమిటీ ఈ 144 లోక్‌సభ స్థానాల్లో కార్యాచరణ అమలు బాధ్యతను పర్యవేక్షిస్తుంది. రెండో స్థాయిలో ఒక్కో కేంద్ర మంత్రికి రెండు లేక మూడు లోక్‌సభ స్థానాల బాధ్యతలు అప్పగిస్తారు. సోషల్‌ విూడియా గ్రూప్‌ల ద్వారాప్రచారాన్ని ఉధృతం చేస్తున్నారు. ప్రధాని తెలంగాణ,తమిళనాడు పర్యటనల్లోనూ రాజకీయాలు కనిపించాయి.