దళితులకు శ్మశాన వాటిక కేటాయించాలి

ఒంగోలు,నవంబర్‌20(జ‌నంసాక్షి): కెవిపిఎస్‌ కొండపి నియోజక వర్గ నాయకులు వి.మోజెస్‌, టి.రాముల ఆధ్వర్యంలో తుమాడు గ్రామ అరుందతివాడ దళితులు స్మశాన స్థలం ఇప్పించాలని కోరుతూ మంగళవారం ఉదయం ఎంఎల్‌ఎ స్వామికి అర్జీ ఇచ్చారు. ఈ సందర్భంగా కెవిపిఎస్‌ కొండపి నియోజక వర్గ కార్యదర్శి మోజెస్‌, దళితులు పడుతున్న ఇబ్బందుల గురించి ఎంఎల్‌ఎ కి వివరించారు. మోజెస్‌ మాట్లాడుతూ.. స్మశాన స్థలం కోసం అధికారుల చుట్టూ తిరిగి ఎన్ని అర్జీలు ఇచ్చినా ఈ సమస్య పరిష్కారం కాలేదని, శాసన సభలో చట్టం ప్రకారం.. జిఒ 1235 ప్రకారం ప్రతీ దళిత పేటకి 2 ఎకరాల భూమిని స్మశానం కోసం కేటాయించాల్సి ఉందని ఎంఎల్‌ఎ కి తెలిపామన్నారు.ప్రభుత్వ భూమి ఉందని,ఈ రెండింటిలో ఏదో ఒకటి తమకు స్మశానానికి ఇప్పించాలని అర్జీలో కోరినట్లు పేర్కొన్నారు. ఎంఎల్‌ఎ స్వామి దళితుల సమస్యలకు వెంటనే స్పందించి స్థానిక తహశీల్దార్‌తో ఫోన్‌లో మాట్లాడారు. వారికి స్మశానానికి స్థలాన్ని వెంటనే కేటాయించాలని అధికారులను ఆదేశించారు. స్థలం కేటాయిస్తే తన సొంత నిధులతో ప్రహరీగోడ, రూమ్‌ కట్టిస్తానని ఎంఎల్‌ఎ చెప్పారు. ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరిస్తానని హావిూ ఇచ్చారు. అవసరమైతే కలెక్టర్‌తో మాట్లాడతానన్నారు. ఈ కార్యక్రమంలో తుమాడు గ్రామ దళితులు కె.సురేంద్ర, నరశింగరామ, దాసు, టి.ప్రభాకర్‌, కె.కోటేశ్వరరావు, కె.ఏసు, సురేష్‌, గోపి, అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.