దసరా ముందు ప్రజలతో చెలగాటమా?

– యూనియన్‌ నేతలు తీరు సరికాదని హెచ్చరిక
– నష్టాల్లో ఉన్నా కార్మికులకు 44శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చాం
– ఆర్టీసీ కార్మికుల సమ్మెపై మండిపడ్డ మంత్రి తలసాని
సంగారెడ్డి,అక్టోబర్‌ 5(జనంసాక్షి):  దసర పండుగ ముందు ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగడాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తీవ్రంగా తప్పుపట్టారు. ఇలాంటి సమయంలో సమ్మె చేయడం సరైనది కాదని కార్మికులపై అసహనం వ్యక్తం చేశారు. శనివారం సంగారెడ్డి జిల్లా నారాయణ్‌ఖేడ్‌లో పర్యటించిన మంత్రి విూడియాతో మాట్లాడారు. దేశంలో ఆర్టీసీ కార్మికులకు అత్యధిక జీతాలు ఇచ్చేది తామేనని పేర్కొన్నారు. ఎక్కడాలేని విధంగా ఆర్టీసీ కార్మికులకు 44  శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చామని, 16 శాతం ఐఆర్‌  కూడా ఇచ్చామని మంత్రి గుర్తుచేశారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాల్సింది పోయి..  బతుకమ్మ, దసరా పండుగలోస్తే సమ్మె చెస్తామంటే ఎలా అని మంత్రి ప్రశ్నించారు. ఇప్పటికే ఐదు వేల కోట్ల నష్టాల్లో ఆర్టీసీ ఉందని.. ఏటా 11 వందల కోట్ల రూపాయల నష్టం జరుగుతున్నా ప్రభుత్వమే భరిస్తోందని తెలిపారు. కార్మికులు రోజుకో డిమాండ్‌ చేయాటాన్ని మంత్రి తప్పుపట్టారు. కార్మికులు ఎలాంటి ఇబ్బందులు లేవని, యూనియన్‌ లీడర్లే కుట్రపూరితంగా ఈ సమ్మె చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికుల కంటేకూడా యూనియన్‌ నాయకుల స్వార్ద ప్రయోజనాల కోసమే సమ్మె చేస్తున్నారని  శ్రీనివాస్‌ యాదవ్‌అన్నారు. సంస్థకు 1100కోట్ల నష్టం వస్తున్నా కార్మికుల కు ఇచ్చే ప్రోత్సాహకాల్లో లోటుచేయడం లేదని ఈసందర్భంగా ఆయన అన్నారు. శనివారం నారాయణఖేడ్‌లో పాలశీతల కేంద్రాన్ని మంత్రి తలసాని ప్రారంభించారు. తెలంగాణ వచ్చిన సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులకు 44శాతం ఫిట్‌మెంట్‌, 16శాతం ఐఆర్‌ను ప్రభుత్వం ఇచ్చిందన్నారు. సంస్థను కాపాడుకునేందుకు వారు మరింతగా ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందించడం వారి బాధ్యత అన్నారు. దేశంలోని ఇతర రాష్టాల్రతో పోలిస్తే తెలంగాణలోనే ఆర్టీసీ సిబ్బందికి అధిక వేతనాలు ఉన్నాయని అన్నారు. కేసీఆర్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత 24గంటల విద్యుత్‌ ఇస్తున్నామని గుర్తుచేశారు. 70 సంవత్సరాల పాటు పాలించిన నాయకులు ఎవరూ 24గంటల పాటు విత్యుత్‌ను ఇవ్వలేక పోయారని అన్నారు. ఇక కాళేశ్వరం నీటితో సింగూరును నింపి నారాయణఖేడ్‌ నియోజక వర్గాన్ని సస్యశ్యామలం చేస్తామని చెప్పారు. గురుకుల పాఠశాలలుపెట్టి నాణ్యమైన విద్యను అందిస్తున్నఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని పేర్కొన్నారు. ప్రతి పక్షాలకు అభివృద్ధి చేయ చేతకాదు. చేస్తుంటే ఆరోపణలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ల్గ/తులు తమ పొలంలోని కొంత భాగంలో గడ్డి విత్తనాలు నాటుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మనుషులకే డాక్టర్లు లేని దేశంలో పశువులకు కూడా అంబులెన్స్‌ పెట్టిన ఘనత మనదని అన్నారు. ఇక ఎవరూ అడగక పోయినా అన్నివర్గాలు బాగుండాలన్న లక్ష్యంతోనే ప్రభుత్వం సబ్సిడీపై గొర్రెలు అందిస్తోందన్నారు. 4రూపాయల ప్రోత్సాహకం వీలైనంత త్వరలో ఇస్తామని పేర్కొన్నారు. నారాయణఖేడ్‌ ని.యోజనక వర్గంలోచనిపోయిన గొర్రెలకు బదులు దసరాలోపు గొర్రెలను అందజేస్తామని తెలిపారు. డీడీలు కట్టిన వారందరికీ దీపావళిలోగా గొర్రెల పంపిణీ చేస్తామన్నారు.