దుర్గామతకు కందిపప్పుతో అలంకరణ

విశేషంగా ఆకట్టుకుంటున్న అమ్మవారు
లక్నో,అక్టోబర్‌11(జ‌నంసాక్షి):  దేశవ్యాప్తంగా శారదా నవరాత్రులు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నేపధ్యంలో పలువురు కళాకారులు తమ సృజనతో తీర్చిదిద్దిన అమ్మవారి విగ్రహాలు పూజలందుకుంటున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లోని సాహబ్‌గంజ్‌ కిరాణా మండీలో ఈసారి వంద
కిలోల కందిపప్పుతో తీర్చిదిద్దిన దుర్గమ్మవారి రూపాన్ని కొలువు దీర్చారు. ఇది భక్తులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఒక్క అమ్మవారి ప్రతిమనే కాకుండా గణెళిశుడు, కార్తికేయుని ప్రతిమలను కూడా కందిపప్పుతో రూపొందించడం విశేషం. మట్టితో రూపొందించిన ప్రతిమకు కందిపప్పుతో అలంకరించారు. ఈ ప్రతిమను కళాకారుడు ప్రవీణ్‌ విశ్వాస్‌ రూపొందించారు. గత 45 ఏళ్లుగా ఆయన ప్రతిమలను తీర్చిదిద్దుతుంటారు. ఈసారి గణెళిష్‌ మొత్తం 55 దుర్గామాత ప్రతిమలను అందంగా తీర్చిదిద్దారు. దీంతో దీనిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు.