దేవాదాయ భూములకు విముక్తి కలిగేనా

కబ్జాదారుల చెరనుంచి రాబట్టుకోగలిగేనా?
రాజకీయ కబ్జాదారులపై చర్యలకు సిద్దమేనా
దేవాదాయ శాఖ ఉత్సవ విగ్రహంగా ఎందుకు మారింది
హైదరాబాద్‌,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి): అన్యాక్రాంతం అయిన వేలాది ఎకరాల ఆలయాల భూములు ఆక్రమించిన కబ్జాదారుల పని పట్టేందుకు దేవాదాయ శాఖ సంసిద్దతను ప్రకటించింది. సిఎం కెసిఆర్‌ తెలంగాణ ఏర్పడ్డ తరవాత తొలి విూమడియా సమావేశంలో దీనిపై ప్రకటన చేశారు. దేవాదాయ బూములను వెనక్కితీసుకుంటామని చెప్పారు. ఐదేళ్లు కావస్తున్నా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న సమస్యలే ఉన్నాయి. ఆలయ భూముల కబ్జాదారులపై క్రిమినల్‌ కేసులు పెడతామని ప్రకటించినా ఇప్పటి వరకు ఎకరా భూమి కూడా స్వాధీనం చేసుకోలేదు. చాలామంది రాజకీయ నాయకులే కబ్జాకోరులుగా ఉన్నా తెలంగాణ ప్రభుత్వం చర్య తసీఉకున్న దాఖలాలు లేవు.  దేవాదాయ శాఖ రికార్డులు, రెవెన్యూ శాఖ సహకారంతో ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆలయాల భూముల్ని అధికారులు గుర్తించారు. కబ్జాదారులు ఎవరో అధికారులకు తెలుసు. గ్రామంలో సర్పంచ్‌ మొదలు అందరికీ తెలుస. సర్పంచ్‌కు అధికారాలు ఇస్తే అసలు బూముల వివరాలన్నీ బయటకు వస్తాయి. కబ్జాదారులు భూములను తిరిగి ఇవ్వకుంటే క్రిమినల్‌ చర్యలు తప్పవని దేవాదాయ శాఖ కమిషనర్‌ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. స్వాధీనం చేసుకున్న భూమెఉలకు సంబంధించి ఈ స్థలం దేవాదాయ శాఖకు సంబంధించినది’ అని బోర్డులు  కూడా పాతుతామని అన్నారు. అయితే ఎంతవరకు పూనుకుంటారన్దని చూడాలి. ఏళ్లతరబడి దేవాదాయవౄఖ ఉత్సవవిగ్రహంగా మారింది. వచ్చేవారం నుంచే కంచె, బోర్డులు ఏర్పాటు చేస్తారు. కబ్జాదారులు ఎదురుతిరిగితే క్రిమినల్‌ కేసులు పెడతారు. పది రోజుల్లో బోర్డుల ఏర్పాటు, కంచె నిర్మాణం పూర్తవుతుంది. ఈ సందర్భంగా భూములు ఆక్రమించిన రౌడీషీటర్లు, కబ్జాదారుల నుంచి ప్రతిఘటన ఎదురయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో.. పోలీసుల సహకారం తీసుకోనున్నారు. కబ్జాల వెనక కొందరు దేవాదాయ ఉద్యోగుల ప్రమేయం ఉన్నట్లు గుర్తించిన ఉన్నతాధికారులు వారిపైనా శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేశారు. కబ్జాకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకారం అందించిన వారి జాబితాను ఇప్పటికే సిద్ధం చేశారు.కొంతమంది ఈవోలు, ఇతర అధికారులు, కిందిస్థాయి ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలు చేపట్టబోతున్నారు. కొన్నిచోట్ల పూజారులకు ఆలయ భూముల నుంచి వచ్చే ఆదాయాన్ని అనుభవించే హక్కు మాత్రమే ఉండగా.. వారు భూముల్ని అమ్మినట్లు గుర్తించారు. హైదరాబాద్‌లో గజం రూ.50వేలకు పైగా ఉన్న గుడిమల్కాపూర్‌, అత్తాపూర్‌, బంజారాహిల్స్‌ ప్రాంతాల్లో భూముల కబ్జా వెనక పూజారులు, ఇంటిదొంగల సహకారం ఉన్నట్లు పూర్తి ఆధారాల్ని అధికారులు సేకరించారు. పది రోజుల్లో కీలక పరిణామాలు చోటు చోసుకోనున్నాయని తెలిపారు. అన్యాక్రాంతానికి సంబంధించిన భూముల విలువ ఇప్పుడు వేలకోట్లకు చేరింది. రాజకీయ పార్టీల అండదండలతో నేతలు వీటిని కబ్జాలు చేశారు. అమ్ముకున్నారు. జగిత్యాల జిల్లా కొండగట్టు ఆలయ భూముల్లో షెడ్లు నిర్మించారు. మార్కెట్‌ విలువ గుంటకు రూ.25 లక్షల వరకు ఉంది. రామ్‌మందిర్‌ పేర 20 గుంటలు, రాజరాజేశ్వర ఆలయానికి 2 ఎకరాలు ఉండగా అది ఆక్రమణకు గురైంది. రాయికల్‌ మండలం అల్లీపూర్‌లో వెంకటేశ్వర ఆలయం పేరుతో ఉన్న 25 ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయి. ఆ భూమిని కౌలుకు ఇచ్చారు.  జనగామ జిల్లా బచ్చన్నపేట శ్రీచెన్నకేశవ ఆలయానికి సంబంధించి దాదాపు వంద ఎకరాల భూమిని స్థానిక మావో
మిలిటెంట్‌ బెరింపులదో కౌలుదార్లు పట్టాలు చేసుకున్నారు. పూజారులను బెదరించి వెళ్లగొట్టారు. ఈ భూమి విలువ బహిరంగ మార్కెట్లో ఐదారు కోట్లు ఉంటుంది. ఇలా అనేకచోట్ల ఇలాంటి భూములు ఉన్నాయి.  /ూష్ట్రంలో దేవాలయాల భూములు అన్యాక్రాంతమవడానికి రెవెన్యూ అధికారులే కారణమని తెలంగాణ అర్చక సమాఖ్య ఆరోపించింది. దాతలిచ్చిన భూములకు పట్టాలివ్వకుండా రెవెన్యూ అధికారులు తాత్సారం చేయడం వల్లే ఆలయ భూములు ఆక్రమణలకు గురయ్యాయని పేర్కొంది. అర్చక సమాఖ్య రాష్ట్రస్థాయి సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా అర్చక సమాఖ్య వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గంగు ఉపేంద్రశర్మ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో 85వేల ఎకరాల దేవాలయాల భూముల్లో.. 35వేల ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయని అన్నారు. కొన్ని దేవాలయాల్లో అ/-దదె కింద నెలకు కనీస రుసుమును వసూలు చేయడం లేదని, న్యాయస్థానాలు, సీఎం కేసీఆర్‌ జోక్యం చేసుకుంటూనే అద్దె ధరలు పెంచుతూ నోటీసులు జారీ చేస్తున్నారన్నారు. దీనిపై సమగ్ర విచారణకు డిమాండ్‌ చేశారు. జిల్లాల్లో డీఎస్పీ ర్యాంక్‌ అధికారిని అన్యాక్రాంతమైన భూమి కేసుల విచారణాధికారులుగా నియమించాలన్నారు. త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసి.. కబ్జాదారుల చెరనుంచి ఆలయ భూములను వెంటేనే స్వాధీనం చేసుకోవాలని అన్నారు. అర్చకుల ఆధీనంలోని భూములకు వారిపేర్ల విూద పట్టాలిచ్చి.. రైతుబంధు వర్తించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.