దేశం కెసిఆర్‌ నాయకత్వాన్ని కోరుకుంటోంది: చారి

భూపాల్‌పల్లి,మార్చి26(ఆర్‌ఎన్‌ఎ): దేశ ప్రజలు కేసీఆర్‌ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని మాజీ స్పీకర్‌ మదుసూధనాచారి అన్నారు. దేశ రాజకీయాల్లో మార్పులు రావాల్సి ఉందన్నారు. కెసిఆర్‌ మాత్రమే కేంద్ర రాజకీయాల్లో మార్పులకు నాంది పలుకుతారని అన్నారు. 16 ఎంపీ సీట్లను గెలిస్తే కేంద్రంలో కేసీఆర్‌ ప్రధాన భూమిక పోషిస్తారని, ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ పాలనలో దేశ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఈ ఎన్నికలతో ఆ పార్టీలకు కాలం చెల్లిందని చెప్పారు. జిల్లాలో రోజూ మిషన్‌ భగీరథ ద్వారా తాగునీరందించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయని వెల్లడించారు. టీఆర్‌ఎస్‌ సర్కార్‌ అమలుచేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాని, 16 మంది ఎంపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించేలా క్షేత్రస్థాయిలో పనిచేయాలనిఅన్నారు.  జాతీయస్థాయిలో సీఎం కేసీఆర్‌ చక్రతిప్పేలా ఆయనకు మద్దతుగా నిలుద్దాం అని స్థానికంగా కార్యకర్తల సమావేశంలో పిలుపునిచ్చారు. దేశంలోనే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుంచి నంబర్‌ వన్‌ ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న సీఎం కేసీఆర్‌ కేంద్రంలో కీలక భూమిక పోషించాల్సి ఉందని అన్నారు. ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేసి  ఎంపీ అభ్యర్థిని భారీ  మెజార్టీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.