దేశానికి ఆదర్శంగా అభివృద్ది పథకాలు

జడ్పీ చైర్మన్‌ కోరం కనకయ్య
భద్రాద్రి కొత్తగూడెం,ఆగస్ట్‌17(జనం సాక్షి):  యావత్‌ దేశంలోనే ఎక్కడా అమలు కాని పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలు జరగడం రాష్టాన్రికే గర్వ కారణమని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ కోరం కనకయ్య అన్నారు.అభివృద్ధి పథకాల అమలులో భధ్రాద్రి కొత్తగూడెం జిల్లా ముందంజలో ఉందని  అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందుతున్నాయని, ఆసరా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, వితంతు, వృద్దాప్య పింఛన్లు లబ్దిదారులకు సకాలంలో అందించడం జరుగుతోందని అన్నారు.  పెంచిన పింఛన్లను నేరుగా వారి ఖాతాల్లోనే జమ అవుతున్నాయన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకుంటున్న గొప్ప నిర్ణయాలకు నిదర్శనం అభివృదద్‌ఇ కార్యక్రమాలని అన్నారు.
అభివృద్ధికి తాను సాయశక్తులా కృషి చేస్తానన్నారు. బంగారు తెలంగాణ ధ్వేయంగా ముఖ్యమంత్రిగా సీఎం
కేసీఆర్‌ తీనుకుంటున్న నిర్ణయాలను తెలంగాణ ప్రజలు స్వాగతిస్తున్నారన్నారు. దేశంలో ఎక్కడాలేనటేవంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రజల గుండెల్లో నిలిచారని కొనియాడారు.