దోమతెరలు వినియోగించండి

నిర్మల్‌,సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి): దోమతెరలు వినియోగిస్తే విషజ్వరాల నుంచి తప్పించుకోవని, దోమలుదరిచేరవని ప్రభుత్వ జిల్లా వైద్యాధికారులు అన్నారు. గ్రావిూణ ప్రాంత ప్రజలకు భారత ప్రభుత్వం అందించిన దోమతెరలను సద్వినియోగం చేసుకోవడంతో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఆయా గ్రామాల్లోని ప్రజలతో వారు మాట్లాడారు. దోమ తెరలు ప్రతీ విద్యార్థి వాడే విధంగా చూడాలని వైద్య సిబ్బందికి స్థానిక పాఠశాల ఉపాధ్యాయులకు సూచించారు. గ్రామాల్లోని కుటుంబంలోని సంఖ్యను బట్టి దోమ తెరలు అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు. దోమతెరలు అందించిన తీరు వారు వినియోగిస్తున్న తీరును పరిశీలించి, ఇలాగే వీటిని వినియోగిస్తే జ్వరాలు రావని పేర్కొన్నారు. దోమలను నియంత్రించేందుకు ప్రభుత్వం అందించిన జిల్లాకు సరఫరా చేసిన దోమతెరలు మారుమూల గ్రావిూణ ప్రాంతాల ప్రజలకు అందాయా లేదా.. వాటిని వినియోగిస్తున్నారా..లేదా అన్న విషయాన్ని అడిగి తెలుసుకుని గ్రామాల్లో పరిశీలించారు. వాటిని వినియోగించే విధానంను అడిగి తెలుసుకుని గ్రావిూణ ప్రాంత ప్రజలకు వాటి వినియోగం, వినియోగించే విధానంను క్లుప్తంగా వివరించారు. ఉమ్రి పంచాయతీ పరిధిలోని సాలైగూడాలోని శాటిలైట్‌ పాఠశాలలను సందర్శించి వారికి దోమ తెరలు అందించారా లేదా, వారికి వ్యాధులు వస్తే ఎలాంటి మందులు ఇస్తున్నారు అంటూ సంబందిత వైద్య సిబ్బందిని అడిగి తెలసుకుని వారి వద్ద ఉన్న మందులను పరిశీలించారు. అనంతరం వ్యాధులు, జ్వరాలు రావడానికి కారణాలేంటీ అనే విషయాలపై విద్యార్థులకు పూర్తి అవగాహన కల్పించారు.