దోషులను వదిలిపెట్టం

` ఎంతటివారినైనా శిక్షిస్తాం:మంత్రి కేటీఆర్‌
` పటిష్టంగా తెలంగాణపబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌
` ఇద్దరు చేసిన తప్పుకు వ్యవస్థను తప్పు పట్టరాదు
` పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ వ్యవస్థ పటిష్టంగానే ఉంది
` అపోహలు సృష్టించేవారిని యువత నమ్మొద్దు
` త్వరలోనే మళ్లీ పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తాం
` విద్యార్థులు పరీక్ష ఫీజును చెల్లించాల్సిన అసవరం లేదు
` తప్పు చేసిన ఇద్దరి వెనక ఎవరున్నా వదలిపెట్టం
` మీడియా సమావేశంలో మంత్రి స్పష్టీకరణ
హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పటిష్టంగా ఉందని…పేపర్‌ లీకేజీ వెనక ఇద్దరు వ్యక్తులు ఉన్నారని.. వాళ్లిద్దరు చేసిన తప్పు అని.. ఇది వ్యవస్థ చేసిన తప్పు కాదని మంత్రి కేటీఆర్‌  వివరించారు. భారతదేశంలోనే అత్యుత్తమ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ లలో ఒకటిగా గుర్తింపు టీఎస్‌ పీఎస్సీ గుర్తింపు పొందిందని.. కాలాగుణంగా సాంకేతికంగా ముందుకు వెళుతుందన్నారు. అందులో భాగంగానే  ఓటీఆర్‌.. వన్‌ టైం రిజిస్టేష్రన్‌  తీసుకు రావటం జరిగిందన్నారు. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, అపోహలు సృష్టించేవారిని నమ్మొద్దని మంత్రి కేటీఆర్‌ తెలంగాణ యువతకు సూచించారు. టీఎస్‌ పీఎస్సీ చైర్మన్‌, నలుగురు మంత్రుల తో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత.. సీఎం కేసీఆర్‌ మాటగా.. శనివారం.. సమావేశం వివరాలను మంత్రి కేటీఆర్‌ విూడియాకు వివరించారు. వీళ్లిద్దరే కాకుండా లీకేజీ కేసులో ఇంకెవరు ఉన్నా.. అందరినీ కఠినంగా శిక్షిస్తామన్నారు. ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పు అని.. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఎంతో సమర్థ వంతంగా పని చేస్తుందని.. వ్యవస్థ చక్కగా ఉందని వివరించారు.  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 155 నోటిఫికేషన్లు విడుదల అయ్యాయని.. 37 వేల ఉద్యోగాలను టీఎస్‌ పీఎస్సీ ద్వారా భర్తీ చేయటం జరిగింద న్నారు.  టీఎస్‌ పీఎస్సీ ద్వారా ఒకే సారి 10 లక్షల మందికి పరీక్ష నిర్వహించిన ఘనత సాధించిందన్నారు. డిజిటల్‌ చెల్లింపులు.. కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలు నిర్వహించిన ఘనత కూడా టీఎస్‌ పీఎస్సీదే అని వివరించారు మంత్రి కేటీఆర్‌. 99 పరీక్షలను నిర్వహించటం ద్వారా.. నాలుగున్నర లక్షల మంది స్టూడెంట్స్‌ హాజరయ్యారని వివరించారాయన. యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సభ్యులు.. రెండుసార్లు తెలంగాణకు వచ్చి టీఎస్‌ పీఎస్సీపై అధ్యయనం చేశారని.. దేశంలోని 13 రాష్టాల్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సభ్యులు వచ్చి పరిశీలించి.. అధ్యనం చేసి.. ఆయా రాష్టాల్ల్రో అమలు చేశారని మంత్రి కేటీఆర్‌ వెల్లడిరచారు.  దేశంలోనే అత్యధిక ఉద్యోగాలను భర్తీ చేసిన సర్వీస్‌ కమిషన్‌ గా.. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ గుర్తింపు పొందిందని స్పష్టం చేశారాయన. 28 రాష్టాల్ల్రో ఎక్కడా జరగని విధంగా.. ఏడు భాషల్లో ఒకేసారి పరీక్షలు నిర్వహించిన ఘనత కూడా టీఎస్‌ పీఎస్సీదే అన్నారు. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పటిష్టంగానే ఉందని, కేవలం ఇద్దరు వ్యక్తుల వల్లే పేపర్‌ లీకేజీ జరిగిందని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. నిరుద్యోగ యువత ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, గతంలో దరఖాస్తు చేసుకున్న వారంతా మళ్లీ పరీక్షలకు హాజరు కావొచ్చని కేటీఆర్‌ పేర్కొన్నారు. పారదర్శకత తీసుకురావాలని అనేక చర్యలు చేపట్టడం జరిగింది.ఉమ్మడి ఏపీలో ఏపీపీఎస్సీ విూద ఆరోపణలు వచ్చేవి. కానీ 37 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. ఒక్క ఆరోపణ కూడా రాలేదు. గతంలో ఇంటర్వ్యూల్లో తప్పులు జరిగాయని టీఎస్‌పీఎస్సీ రద్దు చేసింది. రాతపరీక్ష, మెరిట్‌ లిస్ట్‌ ఆధారంగా ఉద్యోగ నియామకాలు చేపడుతున్నాం అని కేటీఆర్‌ తెలిపారు.దురదృష్టవశాత్తు ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పు వల్ల మొత్తం వ్యవస్థకే చెడ్డపేరు వచ్చిందన్నారు. ఇది జరగకూడని పని. నివారించాల్సిందే. రాష్ట్ర యువతలో భరోసా నింపాల్సిన బాధ్యత మా విూద ఉంది.. కచ్చితంగా ప్రవీణ్‌, రాజశేఖర్‌ అనే ఇద్దరు వ్యక్తులే కాదు.. వీళ్ల వెనకాల ఎవరున్న తప్పకుండా వారిని కఠినంగా శిక్షిస్తాం. ఈ విషయంలో ఎలాంటి రెండో అభిప్రాయం పెట్టుకోవద్దు. ఇది వ్యవస్థ తప్పు కాదు.. ఇది కేవలం ఇద్దరి తప్పు. పరీక్షలను రద్దు చేయడం వల్ల లక్షలాది మంది పిల్లలకు ఇబ్బంది కలుగుతుంది. మేం కూడా బాధపడుతున్నాం. నీళ్లు, నిదులు, నియామకాలు అనే పునాది విూదనే తెలంగాణ ఉద్యమం నడిరచిందన్నారు.  అభ్యర్థులు ఎవరూ మళ్లీ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ నాలుగు పరీక్షలు గతంలో రాసిన వారు మళ్లీ చెల్లించాల్సిన అవసరం లేదు. వీలైనంత త్వరగా పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తాం. అభ్యర్థులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో.. గ్రూప్‌`1, టీపీబీవో, డీఏవో, ఏఈఈ ఎగ్జామ్స్‌కు సంబంధించిన మెటిరీయల్‌ను ఆన్‌లైన్‌లో అందుబాటులో పెడుతాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్టడీ సర్కిళ్లను బలోపేతం చేస్తాం. జిల్లాల్లో రీడిరగ్‌ రూమ్స్‌ 24 గంటలు తెరిచి ఉంటాయి. ఫ్రీ మెటిరీయల్‌తో పాటు ఉచిత భోజన వసతి కూడా కల్పిస్తాం అని కేటీఆర్‌ స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీక్‌ కేసు నిందితులను సిట్‌ కస్టడీకి అప్పగించారు. 9 మంది నిందితులను 6 రోజుల కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. చంచల్‌గూడ జైలు నుంచి నిందితులను సిట్‌ అదుపులోకి తీసుకుంది. పేపర్‌ లీక్‌ వ్యవహారంలో ఆర్థిక లావాదేవీలపై సిట్‌ కూపీ లాగనుంది. ప్రశ్నాపత్రం ఎవరెవ్వరికి విక్రయించారనే దానిపై సిట్‌ ఆరా తీయనుంది. నిందితులను మార్చి 23 వరకు సిట్‌ అధికారులు విచారణ చేయనున్నారు.