ద్రవ్య వినిమయ బ్లిలు ఆగడం ఇదే తొలిసారి

అధికార పార్టీ తీరే ఇందుకు కారణం
మండిపడ్డ విపక్షనేత యనమల
అమరావతి,జూన్‌18(జ‌నంసాక్షి): ద్రవ్య వినిమయ బ్లిు ఆగడం చరిత్రలోనే ఇది తొలిసారి అని ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలిలో ప్రధాన ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు అన్నారు. గురువారం ఆయన విూడియాతో మాట్లాడుతూ..బ్లిు పెట్టాని ప్రతిపక్షం అడిగితే ప్రభుత్వం ముందుకు రాకపోవడం విచిత్రంగా ఉందన్నారు. బడ్జెట్‌ కంటే ఇతర అంశాు ముఖ్యమైనవని చెప్పడం చరిత్రలో ఎప్పుడూ లేదన్నారు. మండలిలో మంత్రు రెచ్చిపోయి ఇష్టానుసారంగా మాట్లాడారని ఆరోపించారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా మంత్రు తిట్ల పురాణం అందుకున్నారని విమర్శించారు. తిట్లు భరించలేక ప్రతిస్పందించిన సందర్భాు కూడా ఉన్నాయన్నారు. నిబంధన పరిధి దాటి ఎప్పుడూ సభలో వ్యవహరించలేదని యనమ స్పష్టం చేశారు. ద్రవ్య వినిమయ బ్లిును ప్రభుత్వం ప్రాధాన్యంగా భావించలేదని పేర్కొన్నారు. మండలికి అంతరాయం కల్పించానే క్ష్యంతోనే ప్రభుత్వం వ్యవహరించిందని దుయ్యబట్టారు. విధ్వంసమని తాను అనని మాటను అన్నట్టుగా చంద్రబోస్‌ చెప్పారని యనమ వివరించారు. బ్లిుు సెక్ట్‌ కమిటీలో ఉన్నాయని ప్రభుత్వమే కోర్టులో ఒప్పుకుందని గుర్తు చేశారు. సెలెక్ట్‌ కమిటీ పరిధిలో బ్లిుు ఉండగా మళ్లీ సభలో పెట్టడం తగదన్నారు. సభలో జరిగిన పరిణామాన్నింటికీ ప్రభుత్వమే కారణమని స్పష్టం చేశారు. సబ్జెక్టుతో సంబంధంలేని మంత్రు సభలోకి ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. మనీ బిల్‌ కాబట్టి 14 రోజు తర్వాత ఆటోమేటిక్‌గా పాస్‌ అవుతుందని యనమ తెలిపారు. లోకేశ్‌పై దాడి చేయాని ప్రయత్నిస్తే అడ్డుకోకుండా ఎలా ఉంటామని నిదీశారు. సాధారణంగా సభలో ప్రతిపక్షం గొడవ చేస్తుంది.. కానీ ఇక్కడ అధికార పక్షం గొడవ చేస్తోందని విమర్శించారు.
ఆ ఇద్దరు మంత్రుతదే బాధ్యత: నాగజగదీశ్‌
శాసనమండలిలో బుధవారం వైసీపీ మంత్రు అనిల్‌ కుమార్‌, వ్లెంపల్లి శ్రీనివాస్‌ మూర్ఖంగా ప్రవర్తించారని, ఇలాంటి ఘటను ఎప్పుడూ చూడలేదని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా నాగ జగదీష్‌ అన్నారు. గురువారం ఆయన విూడియాతో మాట్లాడుతూ ఒక్క సీఎం తప్ప మంత్రుంతా మండలిలోనే ఉన్నారని, ఇష్టమొచ్చినట్లు రెచ్చిపోయారని విమర్శించారు. అనిల్‌ కుమార్‌ అయితే సభలో ప్రజాప్రతినిధిగా
వ్యవహరించలేదని, బూతు మాట్లాడారని ఏం పీక్కుంటారో పీక్కోండంటూ వ్యాఖ్యు చేశారన్నారు. మరో మంత్రి శ్రీనివాస్‌ అయితే సభ్యుమనే గౌరవం లేకుండా ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. 151మందితో అధికారంలోకి వచ్చామని మంత్రు విర్రవీగిపోయి నోటికొచ్చినట్లు బూతు తిట్టారేతప్ప ప్రజకు ఉపయోగపడే చర్చు జరగలేదని నాగ జగదీష్‌ అన్నారు.