ధర్నాచౌక్ ఇక్కడొద్దు

హైదరాబాద్ ఇందిరాపార్క్ దగ్గర కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ధర్నాచౌక్ ఉండాలని జేఏసీ ఆధ్వర్యంలో విపక్షాలు – సిటీ శివార్లకు తొలగించాలని స్థానికులు, వాకర్స్ పోటాపోటీగా నిరసనలకు దిగాయి. వామపక్షాల ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు. అప్పటికే ధర్నాచౌక్ తరలిచాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగిన స్థానికులు ఉండటం.. రెండు వర్గాలు ఎదురెదురు పడటంతో ఉద్రిక్తత నెలకొంది. అనుకూల – ప్రతికూల వర్గాల మధ్య నినాదాలతో హోరెత్తింది. తోపులాట జరిగింది. కుర్చీలు విసిరేసుకున్నారు. ఓ స్థానికుడు గాయపడ్డాడు. పోలీసుల సర్దిచెప్పటంతో శాంతించారు. ధర్నాచౌక్ చుట్టూ పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. భారీ ఎత్తున బలగాలు రంగంలోకి దిగాయి. రెండు వర్గాలు పోటాపోటీ నిరసనలతో ఇందిరాపార్క్ ప్రాంతం రణరంగంగా మారింది.