ధర్నాచౌక్ వద్ద నెలకొన్న ఉద్రిక్తతకు ప్రభుత్వం కారణం

హైదరాబాద్: మేం శాంతియుతంగా నిరసన తెలుపుతున్నాం కానీ, ప్రభుత్వం ఘర్షణపూరిత వాతావరణం సృష్టిస్తోందని రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు. సోమవారం ఇందిరాపార్కులోని ధర్నాచౌక్ వద్ద నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులను ఉద్దేశించి ఆయన  మాట్లాడారు. మేం శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే ప్రభుత్వమే కావాలనే ఈ విధంగా వ్యవహరిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ సీపీ వైఖరిని ఖండిస్తున్నట్లు కోదండరామ్‌ పేర్కొన్నారు. సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించాలని కోరామని, ధర్నాచౌక్ తరలింపు అంశంపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తున్నామని ఆయన తెలిపారు.