ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు

మహబూబ్‌నగర్‌,నవంబర్‌1(జ‌నంసాక్షి): రైతన్నలు పండించే ధాన్యానికి నష్టం కలగకుండా ఉండేందుకు మార్కెట్‌ కమిటీ ద్వారా, మహిళా సంఘాలు, సింగిల్‌విండో ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని మార్కెట్‌ కమిటీ అధికారులు వివరించారు. మరింత ధర వచ్చే వరకు రైతులు తమ ధాన్యాన్ని నిల్వ చేసుకునేందుకు వీలుగా గిడ్డంగులను ఏర్పాటు చేస్తామని చెప్పారు. దళారీ వ్యవస్థను నిర్మూలిస్తామని దగా చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. మార్కెట్‌ కమిటీలలో జరిగే మోసాలపై వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు కమిటీ చైర్మన్‌, సభ్యులతోపాటు అధికారులు చర్యలు తీసుకుంటారని సూచించారు. అన్నదాతలకు అన్నివిధాలా అండ ఉంటామని అన్నారు.