ధాన్యం సేకరణలో ఇబ్బందులు రావద్దు 

జనగామ,మే4(జ‌నంసాక్షి): ధాన్యం సేకరణ, తరలింపులో ఎలాంటి సమస్యలు రాకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ టీ వినయ్‌కృష్ణారెడ్డి కోరారు. రబీలో పకడ్బందీగా ధాన్యం సేకరణ జరిపి రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని  అధికారులను ఆదేశించారు. వరిధాన్యం సేకరణపై
అధికారులతో సవిూక్షా సమావేశం నిర్వహించారు. రెండు, మూడు రోజుల్లో రబీ ధాన్యం సేకరణ కోసం
కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలన్నారు. జిల్లాలో 36 పీఏసీఎస్‌ కేంద్రాలు, 42 ఐకేపీ కేంద్రాలు ప్రారంభించి రైతులకు అనుకూల వాతావరణం కల్పించాలని ఆదేశించారు. రైతులు మార్కెట్‌కు వచ్చిన రోజు నుంచి  ధాన్యం నిల్వలను లెక్క కట్టాల్సి ఉంటుందని, ధాన్యాన్ని మిల్లులు, ఎఫ్‌సీఐ కేంద్రాలను వెంటవెంటనే తరలించాలని సూచించారు.  ఇదిలావుంటే రైతులు సేంద్రియ ఎరువులను వాడడం ద్వారా ఎక్కువ దిగుబడులను సాధించడంతో పాటు నాణ్యమైన పంటలను పొందవచ్చని వ్యవసాయాధికారులు అంటున్నారు. దీంతో పెట్టుబడులు కూడా తగ్గవచ్చన్నారు. సేంద్రియ ఎరువులతో అధిక దిగుబడి వస్తుందని అన్నారు.  రైతులు రసాయన ఎరువులను విపరీతంగా వాడడం వల్ల భూమి లో సారం దెబ్బతిని పంటలు విషంగా మారుతున్నాయన్నారు. దీనిపై రైతులు మేల్కొని ఇప్పటికైనా రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి సేంద్రియ ఎరువులు వియోగించాలన్నారు.