నకిలీ విత్తనాలపై అప్రమత్తం అవసరం

రైతులు ఫిర్యాదుచేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం
నల్లగొండ,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): నకిలీ విత్తనాల విక్రయాలపై ఇప్పటికే నిఘా పెట్టామని నల్గొండ జిల్లా వ్యవసాయ అధికారి  అన్నారు.  ప్రభుత్వ అనుమతి న్న కంపెనీ విత్తనాలను మాత్రమే రషీదు తీసుకుని కొనుగోలు చేయాలన్నారు. ప్రస్తుతం రైతు సర్వే జరుగుతోందని, సిబ్బంది, అధికారులందరూ క్షేత్రస్థాయిలోనే ఉన్నారని అన్నారు. ఎక్కడైనా నకిలీ విత్తనాలు అమ్ముతున్నారన్న సమాచారం ఉంటే వెంటనే తమకు తెలియచేయాలన్నారు.  రైతుల నుంచి ఎటువంటి ఫిర్యాదు వచ్చినా స్థానిక మండల వ్యవసాయఅధికారి దృష్టికి తీసుకురమ్మని ఆదేశించాం. నకిలీ విత్తనాలను అమ్ముతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు కూడా అనుమతి ఉన్న దుకాణాల్లోనే పూర్తి ఆధారాలతో విత్తనాలను కొనుగోలు చేయాలన్నారు. తరవాత జరిగే నష్టానికి ప్రభుత్వం బాధ్యత వహించదన్నారు. నకిలీ విత్తన సంచి ద్వారా రూ.500వరకు లాభం పొందుతున్నారు.  రైతులకు అరువుపైన ఇస్తామని పెట్టుబడి ఖర్చు ఇస్తామని చెప్పడంతో వీటినే కొనడానికే వారు మొగ్గు చూపుతున్నారు.  గతంలో దేవరకొండ, చింతపల్లి లాంటి పలు ప్రాంతాల్లో నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నా అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి. ఈ దందా వెనక ఉన్న కీలక వక్తులెవరూ అన్నది కనుక్కోలేకపోయారు. రైతులు సమాచారం ఇస్తే తప్ప క్షేత్రస్థాయిలోని అధికారులు ఈ విత్తనాలపై పర్యవేక్షణ చేయడం లేదు. రెండుమూడేళ్లుగా జిల్లాలో ఈ ఉదంతాలు జరుగుతున్నా విత్తన డీలర్లు, దుకాణాల నుంచి మాముళ్లు తీసుకొని వారిపై చర్యలకు వెనకాడుతున్నారని
రైతులు ఆరోపిస్తున్నారు.