నకిలీ వేరుశనగ విత్తనాలతో నష్టం

మహబూబాబాద్‌,జనవరి3(జ‌నంసాక్షి):  అనుమతి లేకుండా విడి విత్తనాలు విక్రయిస్తున్న వ్యాపారులపై అధికారులు కఠిన చర్యలు తీసుకొని  రైతులు డిమాండ్‌ చేశారు. నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించేలా చూడాలన్నారు. రబీలో వేరుసెనగ సాగు చేసేందుకు కొనుగోలు చేసిన విత్తనాలతో సాగుచేపట్టారు. విత్తనాలు విక్రయించిన వ్యాపారి ఎలాంటి రశీదు ఇవ్వలేదని, నాణ్యతలేని గింజలను విత్తనాలకు విక్రయించాడని ఆరోపించారు. పెట్టుబడి నష్టపోయామని  గిరిజన రైతులు తెలిపారు. అధికారులు స్పందించి నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని వేడుకుంటున్నారు. ఒక్కో ఎకరా సాగు చేయడానికి విత్తనాలతో కలుపుకొని ఎకరాకు రూ.20వేలు నష్టపోయామని చెబుతున్నారు.