నగదు కోసం రైతుల క్యూ

బ్యాంకుల్లో కొనసాగుతున్న పంపిణీ
ఆదిలాబాద్‌,మే21(జ‌నం సాక్షి): రైతుబందు చెక్కుల పంపిణీ పూర్తయినా బ్యాంకుల్లో రద్దీ తగ్గడం లేదు. చెక్కులు తీసుకున్న వారు ఇక్కడి బ్యాంకుల్లో క్యూ కడుతన్నారు. మూడు నెలల వరకు నగదు తసీఉకునే వెసలుబాటు ఉండడంతో రైతులు మెల్లగా వస్తున్నారు. దీంతో రైతులకు నగదు పంపిణీ నిరాటంకంగా కొనసాగుతోంది. రైతులకు సరిపడా నగదును ప్రభుత్వం బ్యాంకులకు సమకూర్చి పెట్టిందని.. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. రైతులందరికి నగదు చేతికందే వరకు బ్యాంకుల్లో ప్రత్యేక కౌంటర్లను కొనసాగిస్తామని బ్యాంకర్లు స్పష్టం చేస్తున్నారు.రాష్ట్ర రైతు బంధు కింద ఇచ్చిన చెక్కులను నగదుగా మార్చుకొనేందుకు ప్రతిరోజూ వేలాది మంది రైతులు జిల్లా కేంద్రంలోని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఆంధ్రాబ్యాంకు, కెనరా బ్యాంకు, తెలంగాణ గ్రావిూ ణ బ్యాంకుల శాఖల వద్దకు ఉదయం 9గంటల నుంచే చేరుకుంటున్నారు. రైతుల రద్దీని దృష్టిలో ఉంచుకొని బ్యాంకు సిబ్బంది కూడా అరగంట ముందుగానే రైతులకు టోకెన్లు ఇచ్చి వారి నుంచి చెక్కులను స్వీకరించి ఆధార్‌, పాస్‌బుక్‌ వివరాలతో పోల్చి చూసుకుంటున్నారు. వెంట వెంటనే పరిశీలన పూర్తి చేసి రైతుల చేతికి నగదు ఇచ్చి పంపించేస్తున్నారు. టెంట్లు వేసినా వేడిగాలికి ఇబ్బందులు పడకుండా శివాజీచౌక్‌లోని ఎస్బీఐ వద్ద క్యూలైన్‌లో నిల్చున్న రైతుల కోసం కూలర్లను సైతం ఏర్పాటు చేశారు. తొక్కిసలాటలు జరగకుండా పోలీసులు బందోబస్తు చేపడుతున్నారు. స్వచ్ఛంద సంస్థల సభ్యులు అన్నదాతలకు పులి¬ర, తాగునీటి ప్యాకెట్లను అందించి ఉదారతను చాటుకుంటున్నారు.