నాగార్జునసాగర్‌లో గులాబీ జెండా ఎగురేస్తా

జానాకు ఈ సారి రెస్ట్‌ తప్పదు: నోముల

ఇంటింటా ప్రచారంలో వేముల

నాగార్జునసాగర్‌,నవంబర్‌24(జ‌నంసాక్షి): అనేక పర్యాయాలు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న జానారెడ్డి నియోజకవర్గ అభివృద్ధిని విస్మరించారని టీఆర్‌ఎస్‌ నాగార్జునసాగర్‌ ఎమ్మెల్యే అభ్యర్థి నోముల నర్సింహయ్య అన్నారు. అందుకే ఈ ఎన్నికల్లో ఆయనను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నాయనిఅన్నారు. ఇన్నాళ్లూ ఎందుకు అభివృద్ది చేయలేకపోయారో ఆయన ప్రజలకు వివరించాలని

అన్నారు. మంగళవారం అనుముల గ్రామంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 30 ఏండ్లుగా మంత్రిగా, ఎమ్మెల్యేగా ఉన్న జానారెడ్డి తన సొంత ఊరిలో కనీస సౌకర్యాలు కల్పించలేక పోయాడన్నారు. హాలియాను మున్సిపాలిటీగా చేసి అభివృద్ధికి రూ. 50 కోట్లు కేటాయించిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదే అన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి నాగార్జునసాగర్‌లో గులాబీ జెండా ఎగుర వేయాలని కోరారు.

అభివృద్ధి చూసి తట్టుకోలేక కాంగ్రెస్‌ ముసుగేసుకొని మహాకూటమి పేరుతో చంద్రబాబు నాయుడు వస్తుండని, మనంతా అప్రమత్తంగా ఉండి కుటిల ప్రయత్నాలను తిప్పికొట్టాలని టీఆర్‌ఎస్‌ నకిరేకల్‌ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల వీరేశం అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కారుగుర్తుకు ఓటువేయాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఇస్తుంటే, వస్తుంటే 20 రోజులు ఢిల్లీలో ఉండి చివరి వరకు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేసిన చంద్రబాబును ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. తెలంగాణ ఏర్పడిన 4సంవత్సరాల 3నెలల కాలంలో దిశదశను మార్చి అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు అందించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. మరోసారి అశ్వీరదిస్తే సేవకుడిగా ఉండి పని చేస్తానన్నారు.