నాటిన మొక్కలను సంరక్షించాలి

కరీంనగర్‌,జూలై24(జ‌నంసాక్షి):  తెలంగానాకు హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని జిల్లా కలెక్టర్‌ సూచించారు. హరితహారంలో మండలం గ్రామాల వారిగా నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా మొక్కలను నాటాలని, నాటిన మొక్కలను వాటరింగ్‌ చేయాలన్నారు. వర్షాభావ పరిస్తితుల నేపథ్యంలో మొక్కలను నీటిని సరఫరా చేయాలని నాటిన మొక్కలు చనిపోకుండా చూడాలన్నారు. ఆయా శాఖల సిబ్బంది క్షేత్ర స్థాయిలో పర్యటించి వాస్తవాలను గమనించాలన్నారు. చెరువుగట్లు, పొలంగట్లపైన టేకు యూకలిప్టస్‌ వంటి మొక్కలను నాటించాలని ఇందుకు రైతులను ప్రజలను చైతన్య పరచాలన్నారు.  మొక్కలను నాటి వాటి సంరక్షణ భాద్యతలను నిర్వహించాలన్నారు.గ్రామాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని నిర్మాణాలు పూర్తి చేసిన వాటికి డాక్యుమెంటేషన్‌ చేయాలన్నారు. అప్‌లోడ్‌ చేసిన వాటికి వెంటనే చెల్లింపులు చేస్తామన్నారు.  మంజూరు చూసిన మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేస్తామని లబ్దిదారులు కంకణం కట్టుకోవాలన్నారు.  ప్రతి విద్యార్థిని కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలన్నారు.