నాయకన్ గూడెం లో వైద్యశిభిరం

కూసుమంచి  సెప్టెంబర్ 8 ( జనంసాక్షి  ) :  మండలంలోని నాయకుని గూడెం గ్రామంలో ఇటీవల కురిసిన వర్షాలకు వాతావరణంలో వచ్చిన మార్పుల వలన వైరల్ ఫీవర్ లు ఎక్కువగా ఉండటం వలన ఇంతకు ముందే రెండు సార్లు వైద్య   శిబిరాలు నిర్వహించారు .అయినప్పటికీ ఎస్సీ కాలనీ  లోని కొంతమందికి జ్వరాలు ఉండడంతో సోమవారం రోజున ప్రత్యేకంగా ఎస్సీ కాలనీలో మూడవసారి శిబిరరం నిర్వహించి అవసరమైన  వారికి రక్త నమూనాలు సేకరించి  మిగిలినవారికి మందులు సరఫరా చేశారు ఈ కార్యక్రమాన్ని మండల ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఉచితంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి  గ్రామ ప్రత్యేక అధికారి మరియు హెల్త్  సూపర్వైజర్ శ్రీనివాస రావు, మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు కంచర్ల పద్మ వీరారెడ్డి ,సర్పంచ్ కాసాని సైదులు ,ఉప సర్పంచ్  శ్రీకాంత్ ,స్థానిక ఏఎన్ఎంలు రాణి ,ఉపేంద్ర రాణి, ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.