నారాయణఖేడ్ బీఎస్పీ అధ్యక్షుడిగా అలిగే జీవన్ కుమార్

బహుజన్ సమాజ్ పార్టీ నారాయణఖేడ్ నియోజవర్గ   అధ్యక్షుడిగా అలిగే జీవన్ కుమార్ ను నియమిస్తున్నట్లు  సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నటరాజ్ తెలిపారు రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు శుక్రవారం నాడు  నారాయణఖేడ్ నియోజకవర్గ పార్టీ విస్తృతాస్తాయి  సమావేశం నిర్వహించారు నారాయణఖేడ్ అధ్యక్షుడిగా  ఆలిగే జీవన్ కుమార్ నియమిస్తు నియామక పత్రానీ బీఎస్పీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈశ్వర్ అన్నగారు అందజేశారు.ఈ సందర్భంగా అలిగే జీవన్ మాట్లాడుతూ బీఎస్పీ పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తానని, ఖేడ్ లో బహుజనుల పక్షాన నిలబడి పోరాడే ఏకైక పార్టీ బీఎస్పీ అన్నారు. స్వాతంత్రం వచ్చి75 ఏండ్లు గడిచిన బీసీ, ఎస్టీ, ఎస్సి, మైనారిటీ,రెడ్లలో, బ్రహ్మాణ లో పేద ప్రజల కు తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు. కేవలం మూడు కుటుంబాలు మాత్రమే ఆధిపత్యం కోసం, సీటు కోసం కొట్లాడుతారే తప్ప ప్రజల కోసం వారు మాట్లాడారని మండిపడ్డారు. దళిత బంధు పథకం కేవలం టీఆరెస్ పార్టీ కార్యకర్తలకే ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు.అర్హులైన పేదలకు దళిత బంధు ఇవ్వకుంటే ఆందోళనలు చేపడుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ ఇంఛార్జి లు బోర్గి భీమన్న, పండరి,ఉపాధ్యక్షుడు షఫీ, ప్రధాన కార్యదర్శి చౌహన్ బింసింగ్ నాయక్,కార్యదర్శి శంకర్, కోశాధికారి ప్రకాష్, బిబిపెట్ రాజు,మనూర్ మండల అధ్యక్షుడు తుకారం,తదితరులు పాల్గొన్నారు.