నాలుగేళ్లలో సిద్ధిపేటను..  అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాం


– ఎన్ని మార్కులు వేస్తారో విూ చేతుల్లోనే ఉంది
– సిద్ధిపేట సభలో ఆపద్ధర్మ మంత్రి హరీశ్‌రావు
సిద్దిపేట, నవంబర్‌20(జ‌నంసాక్షి) : గత నాలుగున్నర సంవత్సరాలుగా చేసిన పని విూ అందరి ముందు ఉందని, ఎన్నికల పరీక్ష వచ్చిందని, ఈ పరీక్షలో నాకు ఎన్ని మార్కులు వేస్తారో విూ చేతుల్లో ఉందని రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు సిద్దిపేట నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి అన్నారు. సిద్దిపేట, దుబ్బాక నియోజవర్గాల సీఎం కేసీఆర్‌ ప్రజా ఆశీర్వాద సభ సిద్దిపేటలో జరిగింది. ఈ ప్రచార బహిరంగ సభలో హరీశ్‌రావు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి.. బంగారు తెలంగాణను నిర్మిస్తున్న కేసీఆర్‌ అదేవిధంగా వేదికపై ఆశీసులైన ఇతర ప్రజాప్రతినిధులకు హరీశ్‌ అభివాదాలు తెలియజేశారు. అదేవిధంగా దుబ్బాక, సిద్దిపేట నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రతిఒక్కరికి పేరుపేరున శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు తెలిపారు. అనంతరం హరీశ్‌ మాట్లాడుతూ.. ఎంత ఎదిగితే అంత ఒదిగి పనిచేయమని సీఎం తమకు చెప్పారన్నారు. ప్రజల నుంచి ఆశీర్వాదం తీసుకుని ఆ శక్తి నుంచి ప్రజలకు సేవ చేయాలని నేర్పించారన్నారు. కేసీఆర్‌ దీవెనలతో, విూఅందరి ఆశీస్సులతో ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించి ఇక్కడ విూకు సేవచేసే అదృష్టాన్ని తనకు కల్పించారన్నారు. కేసీఆర్‌ నాయకత్వంలో సిద్దిపేటను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ ముందుకు వెళ్తున్నామన్నారు. గత నాలుగున్నర సంవత్సరాలుగా చేసిన పని విూ అందరి ముందు ఉందని, కష్టాల్లో, సుఖాల్లో, అభివృద్ధిలో అన్నింటా విూ కుటుంబ సభ్యుడిగా పనిచేసిన విషయం విూకు తెలిసిందేనన్నారు. పరీక్ష వచ్చిందని, విూ కొడుకుగా, బిడ్డగా, విూ కుటుంబ సభ్యుడిగా నిలబడ్డానని, ఈ పరీక్షలో నాకు ఎన్ని మార్కులు వేసి గెలిపిస్తారో విూ చేతుల్లో ఉందని హరీశ్‌ రావు పేర్కొన్నారు.
కేసీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరిన ముత్యంరెడ్డి..
కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, దుబ్బాక మాజీ ఎమ్మెల్యే చెరుకు ముత్యంరెడ్డి ఆ పార్టీని వీడి టీఆర్‌ఎస్‌ లో చేరారు. సిద్దిపేటలో మంగళవారం నిర్వహించిన టీఆర్‌ఎస్‌ బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. సభా వేదికపైనే ముత్యంరెడ్డికి పార్టీ కండువా కప్పి సాదరంగా  ఆహ్వానించారు. కాగా, తెలంగాణలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం తనకు లభించకపోవడంపై ముత్యంరెడ్డి తీవ్ర అసంతప్తిలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌ పార్టీకి ఆయన రాజీనామా చేశారు. తొగుటలోని ముత్యంరెడ్డి నివాసానికి హరీశ్‌ రావు ఇటీవల వెళ్లారు. టీఆర్‌ఎస్‌ లో చేరాలని ఆయన్ని ఆహ్వానించారు.