నాలుగేళ్ల అధికార మత్తు దించేద్దాం

మాజీ మంత్రి శ్రీధర్‌బాబు

పెద్దపల్లి,నవంబర్‌20(జ‌నంసాక్షి): నాలుగేళ్ల కెసిఆర్‌ అధికారానికి చరమగీతం పాడే రోజులు దగ్గరపడ్డాయని

మాజీ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. కుటుంబ పాలనకు చరమగీతం పాడుదామని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ విజ్ఞతతో ఓటేసి, కెసిఆర్‌ మబురిడీ మాటలకు లొంగవద్దన్నారు. తెరాసను గ్దదె దించే సమయం ఆసన్నమైందని అన్నారు. నాలుగున్నరేళ్లు పాలించిన ఆ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హావిూని అమలు చేయలేదన్నారు. ఇందిరమ్మ ఇళ్లను అపహాస్యం చేసిన కేసీఆర్‌ రెండు పడక గదుల ఇళ్లను కట్టిస్తామని రామగుండంలో ఒక్క గృహాన్నీ మంజూరు చేయలేకపోయారన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ ఇళ్లకు రూ.2 లక్షలు అదనంగా ఇప్పిస్తామని, తెల్ల రేషన్‌కార్డులున్న ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామన్నారు.కేసీఆర్‌ తన కుటుంబంలో ఐదుగురు పదవులు అనుభవిస్తున్నప్పటికీ.. పేదలకు మాత్రం కుటుంబంలో ఒక్కరికే పింఛన్‌ ఇవ్వడం ఎంత వరకు సమంజసమో చెప్పాలన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే అర్హులైన వారందరికీ పింఛన్లు మంజూరు చేస్తామన్నారు. రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలు తోందన్నారు. కేసీఆర్‌ పాలనలో మహిళలకు అన్యాయం జరుగుతోందని, కాంగ్రెస్‌ గెలిచిన ఏడాదిలోనే సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. యువకుల ఆత్మత్యాగాలతో సాకారమైన తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్‌ సాగించిన పాలనను చీపుర్లతో ఊడ్చేయాలని విమర్శించారు. తెరాస పాలనలో పేదల బతుకలు దుర్బరంగా మారాయన్నారు. నియోజకవర్గంలో రెండు పడక గదుల ఊసే లేకుండా పోయిందన్నారు. గడీల పాలనకు చరమగీతం పాడాలని, పేదల రాజ్యం కావాలని పిలుపునిచ్చారు.