నిండుతున్న చెరువులతో రైతుల్లో ఆనందం

కర్నూలు,అక్టోబర్‌12(జ‌నంసాక్షి): వారం రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు వంకలు, వాగులు పొంగడంతో పాటు చెరువులు నిండుతున్నాయి. దాదాపు దశాబ్ద కాలం తరవాత అనేక చెరువుకలు జలకళ వచ్చింది. దీంతో అన్నదాతల్లో ఆనందం వెల్లవిరుస్తుంది. ఆయా గ్రామాల ప్రజలు చెరువులను చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చెరువులు పూర్తిగా నిండితే మూడు సంవత్సరాల వరకు తాగు, సాగునీటికి ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆయా ప్రాంత రైతులు చెబుతున్నారు. చెరువులు పూర్తిస్థాయిలో నిండితే ఈ ప్రాంతంలోని రైతులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా బోర్ల ద్వారా ప్రయోజనం అందుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలావుంటే డోన్‌ మండలంలో ప్రధానంగా అబ్బిరెడ్డిప్లలె, యాపదిన్నె, ఉడుములపాడు, కొచ్చెర్వు చెరువులు నిండడంతో అనేక గ్రామాల్లోని వ్యవసాయ బోర్లలో భూ గర్భ జలాలను పెంచడానికి తోడ్పడుతుంది. అనేక గ్రామాల్లో వ్యవసాయ బోర్లతో రైతులు సాగు చేసుకుంటున్నారు. గ్రామ ప్రజల తాగునీటికి ప్రధాన వనరుగా ఉండి. జిల్లాలోనే ప్రసిద్ధి చెందిన అబ్బిరెడ్డిప్లలె చెరువు కింద మూడు వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. దాదాపు 15 గ్రామాల రైతులకు ఈ చెరువు కింద పొలాలు ఉన్నాయి. అబ్బిరెడ్డి ప్లలె, వెంకటాపురం, గుమ్మకొండ, మ్లలెంప్లలె, లక్ఫీప్లలె, దొరప్లలె, వెంకటనాయునిప్లలె, ధర్మవరం, ఉడుములపాడు, అమకతాడు, కర్లకుంట గ్రామాల రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. ఇప్పటి వరకు తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల నామ మాత్రపు నీరు కూడా చెరువుకు చేరకపోవడంతో చెరువు కింద భూములన్నీ ఏడారులుగా మారి రైతులు పూర్తిగా నష్టపోయారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల పైన యాపదిన్నె చెరువు పూర్తిగా నిండడంతో దిగువనున్న అబ్బిరెడ్డిప్లలె చెరువుకు వరదనీరు చేరుతుంది.