నిరంతర విద్యుత్‌ ప్రగతికి సంకేతం

పోడు సమస్య పరిష్కారంతో గిరిజనులకు లబ్ది :నగేశ్‌
ఆదిలాబాద్‌,అక్టోబర్‌11 (జనంసాక్షి) : నిరంతర విద్యుత్‌ సరఫరా అన్నది పాలనాపరంగా తీసుకున్న విప్లవత్మక నిర్ణయమని మాజీ ఎంపి నగేశ్‌ అన్నారు. అధికారుల పనితీరు కారణంగా ప్రజలు ఆనందంగా ఉన్నారని దీంతో సిఎం కెసిఆర్‌ విధానాలపై ప్రజల్లో మరింత విశ్వాసం పెరిగిందని అన్నారు. పోడుభూముల సమస్యల పరిష్కరించాలని నిర్ణయించడం మంచి ఆలోచన అన్నారు. దీంతో గిరిజనులకు భరోసా దక్కనుందన్నారు. అందుకే అనేక గ్రామాలు ఇపుడు టీఆర్‌ఎస్‌ పార్టీకి జెండాలు కడుతున్నాయని, ఇది శుభపరిణామం అన్నారు. రైతు సమన్వయ సమితులను వ్యతిరేకించే వారు ప్రగతి నిరోధకులే అని స్పష్టం చేశారు. రేవంత్‌రెడ్డి లాంటి నాయకులు చౌకబారు ఆరోపణలతో ప్రజల్లో పలుచనైపోయారని ఎద్దేవా చేశారు. సంస్కృతీ సంప్రదాయాలను గౌరవిస్తూ ప్రభుత్వం అన్ని వర్గాల మన్ననలు పొందుతున్నదని చెప్పారు. ఓర్వలేని కొందరు అభివృద్ధిని ఆపాలని ప్రయత్నించడం మూర్ఖత్వమని తూర్పారబట్టారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆదర్శ పథకాలు అమలు చేస్తున్న రాష్ట్రమని అన్నారు. చెరువులు నిండి గంగపుత్రులు ఉపాధి పొందుతున్నారని, రైతులు సాగునీటి వనరులతో సంతోషంగా ఉన్నారని గుర్తుచేశారు. ఇకపోతే పత్తికి కనీస ధర కల్పించి కొనుగోలు చేయాలని చేసిన సూచనలు వ్యాపారులు పాటించాలని అన్నారు. పత్తి రైతులను ఆదుకోవడం లేదన్న అపఖ్యాతి తీసుకుని రావద్దాన్నారు. రైతులు పండిరచిన పత్తి పంటకు మద్దతు ధరతో కొనుగోలు చేయాలని పత్తి ట్రేడర్స్‌ను ఆదేశించారు.