నిరతంతర విద్యుత్‌ ఘనత కాదా: ఎమ్మెల్యే

నల్లగొండ,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): ప్రత్యేక రాష్ట్రంలో విద్యుత్‌ కొరతను సమర్థవంతంగా ఎదుర్కోవటంతో పాటు పగలే 9 గంటల నిరంతర నాణ్యమైన విద్యుత్‌ను వ్యవసాయానికి ఉచితంగా అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని ఎమ్మెల్యే గాదరి కిషోర్‌ అన్నారు. సాగునీటి అవసరాల కోసం మిషన్‌ కాకతీయ కింద చెరువులను పునరుద్ధరించటం జరిగిందని అన్నారు. అలాగే గోదావరి జలాలలను సాగునీటి అవసరాల కోసం ప్రాజెక్టులు నిర్మిస్తున్నట్లు వివరించారు. సమైక్య రాష్ట్రంలో అప్పటి పాలకులు వ్యవసాయం దండగా అన్నారని, కానీ తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయం అంటే పండుగేనని రుజువు చేస్తుందని పేర్కొన్నారు. రైతుల సమాగ్రాభివృద్ధికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అత్యంత పాధాన్యతనిస్తుందని తెలిపారు. రుణమాఫీ నుంచి వ్యవసాయ పెట్టుబడి వరకు ప్రభుత్వం రైతులకు చేయూతగా నిలుస్తుందని స్పష్టం చేశారు. ఒకప్పుడు విద్యుత్‌ కోసం రైతులు పడిగాపులు పడటంతో పాటు ధర్నాలు సైతం చేయాల్సి వచ్చిందని అన్నారు. సేంద్రియ వ్యవసాయం రైతులతో పాటు ప్రజలకు కూడా ఆరోగ్యకరమని, ఆ దశగా రైతులు వ్యవసాయ పద్ధతులను అలవర్చుకోవాలని సూచించారు. నిపుణుల సూచనలను పాటించాలని కోరారు. రైతు సమన్వయ సమితులతో ముందుకు సాగాలని అన్నారు.