నూతన సంవత్సరానికి భగీరథ నీరు

– తెలంగాణ ప్రజలకు కొత్త సంవత్సరం కానుక

– సీఎం కేసీఆర్‌ వెల్లడి

హైదరాబాద్‌,సెప్టెంబర్‌ 23,(జనంసాక్షి):మిషన్‌ భగీరథ పనులను రెండు భాగాలుగా విభజించుకోవాలని, పార్ట్‌ 1 ను ఈ ఏడాది డిసెంబర్‌ 31లోగా పూర్తి చేయాలని, మరో ఆరు నెలల్లో పార్ట్‌ 2ను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు ఆదేశించారు. పైపులైన్ల ద్వారా నీరు సరఫరా చేయడం ప్రారంభించిన తర్వాత కొద్ది నెలల పాటు పైపులైన్లు లీక్‌ కావడం, వత్తిడి తట్టుకోలేక అక్కడక్కడ పైపులైన్లు పగిలిపోవడం, వాల్స్‌ ల వద్ద సమస్యలు తలెత్తడం లాంటి సహజమైన బాలారిష్టాలు (బివవబిష్ట్రతినిణ జూతీనీపశ్రీవఎబ))ఞ5)ఞ53)3ూ3)3, వాటిని ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూ పోవాలని సిఎం ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన మిషన్‌ భగీరథ పధకం జీవితాంతం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకునే పనిగా మిగిలిపోతుందని, ఇది ఇంజనీరింగ్‌ అద్భుతమని సిఎం అన్నారు. దేశానికే ఆదర్భంగా నిలిచే ఈ పథకాన్ని రికార్డు సమయంలో పూర్తి చేయడం అందరికీ గర్వకారణమని సిఎం అన్నారు. 25వేల ఆవాస ప్రాంతాలకు శుద్ధి చేసిన మంచినీటిని ప్రతీరోజు ప్రతీ ఇంటికి అందించే గొప్ప పథకం దేశంలో మరెక్కడా లేదని సిఎం అన్నారు. అందుకే ఈ పథకాన్ని నీతి ఆయోగ్‌ తో పాటు అనేక రాష్ట్రాలు మొచ్చుకున్నాయని, చాలా రాష్ట్రాలు తమ రాష్ట్రంలో కూడా అమలు చేయడానికి అధ్యయనం చేశాయని సిఎం వెల్లడించారు.ప్రగతి భవన్‌ లో శనివారం మిషన్‌ భగీరథ పనులను ముఖ్యమంత్రి కేసీఆర్‌ సవిూక్షించారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి జోగు రామన్న, ప్రభుత్వ శర్మ, మిషన్‌ భగీరథ వైస్‌ చైర్మన్‌ వేముల ప్రశాంత్‌ , ఎంపి జితేందర్‌ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.పి.సింగ్‌, సిఎంవో అధికారులు శాంతి కుమూరి, స్మితా సభర్వాల్‌, మిషన్‌ భగీరథ ఇ.ఎన్‌.సి. సురేందర్‌ రెడ్డి, సలహాదారు జ్ఞానేశ్వర్‌, కన్పల్డెంట్‌ మనోహర్‌ బాబు, సిఇలు జగన్‌ మోహన్‌, విజయ ప్రకాశ్‌, కృపాకర్‌, ఓఎస్థి సత్యపాల్‌ తదితరులు పాల్గొన్నారు.పార్ట్‌ 1లో భాగంగా ఈ ఏడాది డిసెంబర్‌ చివరి నాటికి రాష్ట్రంలోని 25వేల ఆవాస ప్రాంతాలకు శుద్ధి చేసిన నదీ జలాలను నూతన సంవత్సర కానుకగా అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పైపులైన్ల ద్వారా నీరు పంపించే క్రమంలో కొద్ది నెలల పాటు కొన్ని సహజమైన సమస్యలు తలెత్తుతాయని వివరించారు. వాటిని ఎప్పటికప్పుడు సవరించుకుంటూనే. పార్ట్‌ 2 కింద గ్రామాల్లో ప్రతీ ఇంటికి మంచినీరు అందించేందుకు అవసరమైన అంతర్గత పైపులైన్ల నిర్మాణం, నల్లాల ఏర్పాటు లాంటి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. పార్ట్‌ 2 పనులు కూడా 2018 సవంత్సరం మొదటి అర్థభాగంలో పూర్తి కావాలని చెప్పారు. అంతర్గత పనులన్నీ పూర్తయి, నల్లాల ద్వారా మంచినీరు అందించే సందర్భంగా కూడా ప్రారంభ దశలో కొన్ని సమస్యలు తలెత్తుతాయని వాటిని కూడా వెంటవెంటనే సవరించుకుంటూ పోవాలని సిఎం ఆదేశించారు. నీటి ప్రవాహ వత్తిడి వల్ల ప్రారంభంలో పైపులు లీకేజీ కావడం, వాల్‌ ల వద్ద లీకేజీల లాంటి సమస్యలు తలెత్తుతాయని, దాంతో భయపడి పోవద్దని కేసీఆర్‌ సూచించారు. పథకం ప్రారంభమయిన గజ్వేల్‌ లో కూడా రెండు నెలల వరకు చిన్న చిన్న సమస్యలు వచ్చాయని గుర్తు చేశారు.సవిూక్షలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న మిషన్‌ భగీరథ పనులను సిఎం కేసీఆర్‌ గూగుల్‌ మ్యాప్‌ ద్వారా పరిశీలించారు. ఎక్కడెక్కడ ఏ సమస్య తలెత్తున్నదో అడిగి తెలుసుకున్నారు. జిల్లాల వారీగా, సెగ్మెంట్ల వారీగా ఇన్‌ టేక్‌ వెల్స్‌ వాటర్‌ ట్రీట్మెంట్‌ ప్లాంట్లు, ఓ.హెచ్‌.బి.ఆర్‌.ల నిర్మాణం, పైపులైన్ల నిర్మాణం, ఎలక్టో మోటార్‌ పనుల పురోగతిని సిఎం సవిూక్షించారు. మొత్తం 24,225 ఆవాస ప్రాంతాలకు మంచినీరు అందించాలనే లక్ష్యంలో భాగంగా ఇప్పటికే 3,431 గ్రామాలకు మంచినీరు అందిస్తున్నామని, అక్టోబర్‌ చివరి నాటికి మరో 5,443 గ్రామాలకు, నవంబర్‌ చివరి నాటికి మరో 6,006 గ్రామాలకు, డిసెంబర్‌ చివరి నాటికి మిగిలిన 9,345 గ్రామాలకు మంచినీరు అందిస్తామని అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి చెప్పారు. పైపులైన్ల నిర్మాణంతో పాటు మోటార్లు బిగించే పనులు కూడా వేగంగా చేస్తున్నట్లు వివరించారు.

విద్యుత్‌ శాఖను అభినందించిన సిఎం కేసీఆర్‌:

మిషన్‌ భగీరథకు కావాల్సిన విద్యుత్‌ ను అందించడానికి విద్యుత్‌ శాఖ చేసిన ఏర్పాట్లను సిఎం కేసీఆర్‌ అభినందించారు. మిషన్‌ భగీరథ కోసం చేపట్టిన పనులన్నీ అక్టోబర్‌ 2 నాటికే పూర్తవుతాయని జెన్‌ కో-ట్రాన్స్‌ కో సిఎండి డి.ప్రభాకర్‌ రావు సిఎంకు తెలిపారు. 2017 డిసెంబర్‌ 31 లక్ష్యంగా మిషన్‌ భగీరథ పనులు చేపట్టగా, విద్యుత్‌ శాఖ మాత్రం రెండు నెలల ముందే తమకు అప్పగించిన బాధ్యతలను నెరవేర్చిందని సిఎం కేసీఆర్‌ జెన్‌ కో సిఎండికి ఫోన్‌ చేసి ప్రశంసించారు. రూ.300 కోట్ల అంచనా వ్యయంతో సబ్‌ స్టేషన్ల నిర్మాణం, విద్యుత్‌ లైన్ల ఏర్పాటు, ట్రాన్స్‌ ఫార్మర్లు బిగించడం లాంటి పనులన్నీ పూర్తి చేసిట్లు ప్రభాకర్‌ రావు వివరించారు. మిషన్‌ భగీరథ కోసం 221 మెగావాట్ల నిరంతర విద్యుత్‌ అందించడం కోసం 42 సబ్‌ సబ్‌ స్టేషన్లు, 1190 కిలోవిూటర్ల పైపులైన్లు నిర్మించామని, 87 పవర్‌ ట్రాన్స్‌ ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నామని ఆయన సిఎంకు చెప్పారు. మునుగోడు, దేవరకొండకు ప్రథమ ప్రాధాన్యం :

ఫ్లోరైడ్‌ పీడిత మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి మొదట మంచినీరు అందించాలని సిఎం చెప్పారు. ఈ రెండు నియోజకవర్గాల్లో అక్టోబర్‌ చివరి నాటికే పనులు పూర్తి చేసి, అంతర్గత పనులను కూడా చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోని గిరిజన తండాలు, దళిత వాడలు, గోండు గూడేలకు నూటికి నూరు శాతం మంచినీరు అందించాలని అందిచాలని కోరారు.

పాలేరుకు డిప్యూటీ సిఎం బృందం:

పాలేరు సెగ్మెంట్‌ పరిధిలోని పాత వరంగల్‌ జిల్లా మండలాలకు నీరందించే పనులు కాస్త ఆలస్యంగా జరుగుతున్నాయని సిఎం కేసీఆర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. పాలేరు ద్వారా పాత వరంగల్‌ జిల్లాలోని మహబూబాబాద్‌, డోర్నకల్‌, నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 1706 ఆవాస ప్రాంతాలకు నీరు అందించాలని చెప్పారు. అయితే పనులు అనుకున్నంత వేగంగా జరగడం లేదని చెప్పారు. వచ్చే రెండు నెలల సమయంలో పనులన్నీ పూర్తయ్యే విధంగా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని చెప్పారు. డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి, మిషన్‌ భగీరథ వైస్‌ చైర్మన్‌ ప్రశాంత రెడ్డి నాయకత్వంలోని బృందం పాలేరు సెగ్మెంటును సందర్శించి వర్కింగ్‌ ఏజన్సీలు, అధికారులతో సవిూక్షించాలని చెప్పారు.

మిషస్‌ భగీరథ ద్వారా పరిశ్రమలకు నీరు:

మిషన్‌ భగీరథ ద్వారానే పరిశ్రమలకు కూడా శుద్ధి చేసిన మంచినీటిని అందించాలని సిఎం అధికారులను ఆదేశించారు. మంచినీరు అవసరం ఉన్న పరిశ్రమల నుంచి దరఖాస్తులు ఆదేశించాలని, వారికి ప్రత్యేకంగా పైపులైన్లు వేసి నిరంతరం నీటి సరఫరా చేయాలని సిఎం కోరారు. మిషన్‌ భగీరథకు కేటాయించిన దాదాపు 80 టి.ఎం.సి ల నీటిలో పది శాతం (8 టిఎంసిలు) పరిశ్రమలకు అందించే వెసులుబాటు ఉందని సిఎం చెప్పారు. హైదరాబాద్‌ నగర మంచినీటి అసవరాల కోసం పది టిఎంసిల డెడికేటెడ్‌ రిజర్వాయర్‌ కడుతున్నందున అక్కడి నుంచి పరిశ్రమలకు నీరందించడం సాధ్యమవుతుందని వెల్లడించారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయితీలకు కూడా మిషన్‌ భగీరథ ద్వారానే బల్క్‌ సప్లయ్‌ చేయాలని కోరారు.