నేటినుంచి గీతాజ్ఞాన యజ్ఞం

హైదరాబాద్‌,మే18(జ‌నంసాక్షి): ఈ నెల 19 నుంచి నగరంలో గీతాజ్ఞాన యజ్ఞ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ నెల 19 నుంచి 20 వరకు సాయంత్రం 6.30గంటల నుంచి రాత్రి 8గంటల వరకు, 21న ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు మైత్రీనగర్‌ మదీనాగూడలోని అలివేలు మంగ పద్మావతీ సమేత వేంకటేశ్వరస్వామి ఆలయంలో నిర్వహిస్తున్నారు. భగవద్గీత సారాన్ని ప్రజలందరికీ చేర్చేందుకు అక్షర విద్యా ట్రస్ట్‌, త్యాగరాయగాన సభ సంయుక్త ఆధ్వర్యంలో  నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్‌ కార్యనిర్వహకురాలు మంగళా ప్రసాద్‌ తెలిపారు. గత మూడేండ్లుగా పరమ పూజ్య దయానంద సరస్వతి, పరమానంద సరస్వతుల శిష్యురాలు పూజ్య స్వామిని సత్యవ్రతానంద సర్వసతితో గీతాజ్ఞాన యజ్ఞ వేడుకలను నిర్వహిస్తూ వస్తున్నామన్నారు. సత్యవ్రతానంద సరస్వతి ఆది శంకరాచార్య విరచిత భజగోవిందం ఆధ్యాత్మిక ప్రవచనాలు చేస్తారన్నారు. అలాగే చిక్కడపల్లిలోని త్యాగరాయగానసభలో 21 నుంచి 25 వరకు సాయంత్రం 6.30గంటల నుంచి రాత్రి 8గంటల వరకు శ్రీ మద్భగవద్గీత ఐదవ అధ్యాయం, కర్మ సన్యాస యోగం కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.