నేటినుంచి తుదివిడత కౌన్సిలింగ్‌

హైదరాబాద్‌,జూలై19(జ‌నం సాక్షి): రాష్ట్రంలోని ఇంజినీరింగ్‌ కాలేజీల్లో సీట్ల భర్తీ కోసం ఈనెల 20న శుక్రవారం నుంచి ఎంసెట్‌-2018 తుదివిడుత కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్టు ఎంసెట్‌ ప్రవేశాల కమిటీ కన్వీనర్‌ నవీన్‌మిట్టల్‌ తెలిపారు. శుక్ర, శనివారాల్లో అడ్మిషన్‌ ఫీజు చెల్లింపు, 21న సర్టిఫికెట్ల పరిశీలన, 21 నుంచి 23 వరకు వెబ్‌కౌన్సెలింగ్‌ ఉంటుంది. 25న సీట్లు కేటాయిస్తారు. సీట్లు పొందిన విద్యార్థులు కాలేజీల్లో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయడంతోపాటు ప్రవేశానికి 25 నుంచి 27 వరకు గడువు విధించారు. అయితే పి/-పటికే దాదాపు అన్‌ఇన సీట్ల భర్తీతో పాటు అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి కాగా అనేక కాలేజీల్లో క్లాసులు కూడా ప్రారంభం అయ్యాయి. దీంతో ఇక తుదివ ఇడత క ఔన్సింలింగ్‌ లాంఛనమే కానుందని సమాచారం.