నేటినుంచి నల్గొండ పట్టణంలో జాతీయస్థాయి తైక్వాండో

నల్గొండ,డిసెంబర్‌20(జ‌నంసాక్షి): ఈ నెల 21 నుంచి నల్గొండ పట్టణంలో జాతీయస్థాయి తైక్వాండో, బాల్‌ బ్యాడ్మింటన్‌ పోటీలను నిర్వహిస్తున్నారు.  జాతీయస్థాయి క్రీడా పోటీలకు వివిధ రాష్టాల్రకు  చెందిన 667 మంది క్రీడాకారులు హాజరవుతున్నారు.  బాల్‌ బ్యాడ్మింటన్‌ పోటీలకు 14 రాష్టాల్రకు చెందిన క్రీడాకారులు, తైక్వాండో పోటీలకు 25 రాష్టాల్రకు చెందిన క్రీడాకారులు హాజరవుతున్నారు. జిల్లా స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో వీటిని  నిర్వహిస్తున్నారు.క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ ఆదేశించారు. క్రీడాకారులకు ప్రధానంగా వసతి, భోజన, టాయిటెట్స్‌, మంచినీరు తదితర సౌకర్యాలను పక్కాగా ఏర్పాటు చేయాలని కోరారు.తైక్వాండో పోటీలను నల్గొండ ఇంద్రారెడ్డి ఫంక్షన్‌ హాల్‌లో, బాల్‌ బ్యాడ్మింటన్‌ పోటీలను డాన్‌బాస్కో అకాడవిూలో
నిర్వహించనున్నట్లు తెలిపారు. పోటీల నిర్వహణ కోసం పీఈటీలను, పీడీలను నియమించామన్నారు.
పోటీలు జరిగే నల్గొండలోని డాన్‌బాస్కో అకాడవిూ, ఇంద్రారెడ్డి ఫంక్షన్‌ హాల్‌లో ఏర్పాట్లను పరిశీలించారు.