నేటినుంచి పత్తి కొనుగోళ్లు

దసరా తరవాత మిగా ప్రాంతాల్లో ఏర్పాట్లు
రైతులకు గుర్తింపు కార్డులు తప్పనిసరి
ఆదిలాబాద్‌,అక్టోబర్‌16(జ‌నంసాక్షి):  ఆదిలాబాద్‌ మార్కెట్‌ యార్డులో ఈనెల 17 నుంచి పత్తి కొనుగోళ్లను ప్రా రంబిస్తున్నట్లు మార్కెటింగ్‌ అడిషనల్‌ డైరెక్టర్‌ పి.రవికుమార్‌ తెలిపారు. పూర్వపు జిల్లాలో 18 మార్కెట్‌ యార్డులు ఉండగా.. ఆదిలాబాద్‌లో 9, నిర్మల్‌లో 5, మంచిర్యాల్‌లో 4, ఆసిఫాబాద్‌లో 4 మార్కెట్‌ యార్డులు ఉన్నాయని తెలిపారు. ముందుగా ఆదిలాబాద్‌ మార్కెట్‌ యార్డులో 17 నుంచి కొనుగోళ్లను ప్రారంభిస్తామని, మిగతా మార్కెట్‌ యార్డుల్లో దసరా అనంతరం కొనుగోళ్లు ప్రారంభం అవుతాయన్నారు. అన్ని మార్కెట్‌ యార్డుల్లో రైతుల సౌకర్యా ర్థం ఏర్పాట్లు పూర్తి చేయాలని కార్యదర్శులను ఆదేశించారు.
సీజన్‌లో 24 లక్షల క్వింటాళ్ల పంట దిగుబడి వస్తుందని అంచనా వేసిన అధికారులు కొనుగోళ్లకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. రైతు పత్తిని అమ్ముకోడానికి మార్కెట్‌ యార్డుకు వచ్చే ముందు ఇటీవల జారీ చేసిన గుర్తింపు కార్డు, బ్యాంక్‌ జిరాక్స్‌ కాపీ వెంట తీసుకరావాలన్నారు. కార్డులేని రైతులు ఆధార్‌, ఏఈవోల
నుంచి ధ్రువీకరణ పత్రాలను తీసుకరావాల్సి ఉంటుందని తెలిపారు.  రైతులు తమ పత్తిని ఆరబెట్టుకొని మార్కెట్‌ యార్డుకు తీసుకరావాలని సూచించారు. తేమ శాతం పై ఇప్పటికే టీవీ స్కోల్రింగ్‌, కరపత్రాల పంపిణీ, గ్రావిూణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కార్యదర్శులందరూ పత్తి కొనుగోళ్ల సమయంలో మార్కెట్‌ యార్డుల్లో అందుబాటులో ఉండాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తాగునీటితో పాటు విశ్రాంతి గదులు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. మార్కెట్‌యార్డుల్లో కాంటాలు, తేమ కొలిచే యంత్రాలు, టార్పాలిన్లను సిద్ధం చేశారు. జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ మార్కెట్‌ యార్డు ల్లో 9 సీసీఐ కేంద్రాల ద్వారా పత్తి కొనుగోళ్లు చేపట్టాల ని నిర్ణయించారు. ఆదిలాబాద్‌లో 2, ఇంద్రవెల్లి, బేల, ఇచ్చోడ, బోథ్‌, నేరడిగొండ, పొచ్చర, సొనాలలో కేం ద్రాలను ఏర్పాటు చేస్తారు. ఈ సారి కేంద్రం పత్తికి క్విం టాకు రూ.5450 ధర నిర్ణయించగా.. గత ఏడాది కంటే రూ.1130 అధినం. పత్తి కొనుగోళ్లలో అక్రమాలు జరుగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. మార్కెట్‌యార్డుల్లో ఆన్‌లైన్‌ విధానం ద్వారా పంటను కొనుగోలు చేస్తారు. పత్తిని మార్కెట్‌యార్డుకు తీసుకొచ్చే రైతు వివరాలు పట్టాపాసు పుస్తకం ఆధారంగా ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. మార్కెట్‌యార్డుల్లో వెబ్‌క్యామ్‌ల ద్వారా చిత్రీకరించడంతో పాటు రైతు వేలిముద్రలు సైతం సేకరిస్తారు. ఫలితంగా పత్తి కొనుగోళ్లు పారదర్శకంగా జరిగే అ వకాశాలున్నాయి. మార్కెట్‌యార్డుల్లో ఈ విధానాన్ని అమలు చేయడం ద్వారా దళారులు, మహారాష్ట్రకు చెం దిన రైతుల జిల్లాలో పత్తిని విక్రయించే అవకాశం ఉండదు. పత్తి కొనుగోళ్లకు సంబంధించి కలెక్టర్‌ ఇప్పటికే అధికారులతో పలు సమావేశాలు నిర్వహించారు. కొనుగోళ్లు సక్రమంగా జరిగేలా మార్కెటింగ్‌, వ్యవసాయశాఖ అధికారులకు తగిన సలహాలు, సూచనలు చేశారు. తేమ శాతంపై రైతులకు అవగాహన కల్పించాలని, వారు తీసుకొచ్చిన పత్తి పంట తేమ శాతం రైతుల ముందే పరీక్షించాలని సూచించారు. రైతులు ట్రేడర్స్‌, దళారులకు పత్తిని అమ్మకుండా సీసీఐకి అమ్మేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. రైతులకు టార్పాలిన్‌ కవర్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. పత్తి కొనుగోళ్లకు సంబంధించి మంగళవారం కలెక్టర్‌ దివ్య దేవరాజన్‌ ప్రైవేటు వ్యాపారులతో సమావేశం నిర్వహించనున్నారు.