నేటి నుంచి కొమురవెల్లి జాతర

రెండు నెలలపాటు జరుగనున్న ఉత్సవాలు
మల్లన్న కల్యాణానికి భారీగా ఏర్పాట్లు
సిద్దిపేట,డిసెంబర్‌29(జ‌నంసాక్షి):  కొమురవెల్లి మల్లన్న జాతర ఆదివారం నుంచి ప్రారంభం కానుండడంతో ఇప్పటికే భారీ ఏర్పాట్లుచేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.  ఆదివారం ఉదయం 10.45 గంటలకు మల్లికార్జునస్వామి కల్యాణ మ¬త్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఇందుకు ఒగ్గు పూజారులు రంగం సిద్దం చేశారు.  ప్రతిఏటా మార్గశిర మాసంలో కళ్యాణోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.  స్వామివారి కల్యాణం నిర్వహించే అర్చకులు రెండు వంశాలకు చెందినవారు ఉన్నారు. వీరిలో అమ్మవారి తరఫున మహాదేవుని వంశంవారు కన్యాదానం చేస్తారు. పగిడన్న వంశం వారు స్వామివారి తరఫున స్వీకరించి కల్యాణం జరిపిస్తారు. ఈ కల్యాణ మ¬త్సవానికి రాష్ట్రం నుంచి లక్షలాదిగా భక్తులు తరలిరానున్నారు. అంతేకాకుండా సంక్రాంతి పండుగ తర్వాత వచ్చే ఆదివారంతో బ్ర¬్మత్సవాలు ప్రారంభమై ఉగాది పండుగ ముందు వచ్చే ఆదివారం ముగుస్తాయి. సుమారు మూడు నెలలపాటు  కొమురవెల్లి జాతర జరుగుతంది. ఉత్సవాల్లో మొదటి ఆదివారాన్ని పట్నంవారంగా, రెండవ ఆదివారాన్ని లష్కర్‌వారంగా పిలుస్తారు. ఈ రెండువారాలనాడు హైదరాబాద్‌ జంట నగరాలనుంచి భక్తులు పెద్దఎత్తున తరలివస్తారు. మూడు నెలల జాతరలో మహాశివరాత్రి పర్వదినం రోజున ఆలయ ఆధ్వర్యంలో పెద్దపట్నం నిర్వహిస్తారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా అగ్నిగుండాలు అత్యంత వైభవంగా చేపడుతారు. భక్తుల రాక ఏటేటా పెరగడంతో అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేశారు. దేవాలయ కమిటీ, ఆలయ ఇవో దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రధానంగా మంచినీటికి ఇబ్బంది లేకుండా, పారిశుద్ద్య సమస్యలు రాకుండా చర్యలు చేపట్టారు.